Tuesday, August 21, 2012

శ్రీరామ నీనామ మెంతో రుచిరా

చిత్రం: ఇద్దరు మిత్రులు (1961) 
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 
గీతరచయిత:   శ్రీరామదాసు  
నేపధ్య గానం: మాధవపెద్ది సత్యం 

పల్లవి: 

శ్రీరామ నీనామ మెంతో రుచిరా 
ఓ రామా నీ నామమెంతో రుచిరా 
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా 
శ్రీరామ నీ నామమెంతో రుచిరా 

పాలు మీగడల కన్నా పంచదార చిలకల కన్నా 
శ్రీరామ నీ నామమెంతో రుచిరా 
పాలు మీగడల కన్నా పంచదార చిలకల కన్నా 
శ్రీరామ.. ఓహో శ్రీరామ నీ నామమెంతో రుచిరా 

చరణం 1: 

తప్పులు చేయుట మా వంతు దండన పొందుట మా వంతు .. 
యమ దండన పొందుంట మా వంతు 
తప్పులు చేయుట మా వంతు.. యమ దండన పొందుట మా వంతు 

పాపం చేయుట మా వంతు దయ చూపించటమే నీ వంతు 

శ్రీరామ.. ఓహో శ్రీరామ నీ నామమెంతో రుచిరా 
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా 
శ్రీరామ నీ నామమెంతో రుచిరా 

శ్రీమద్రమారమణ.. గోవిందో.. హారి..

చరణం 2: 

రాతినే ఇల నాతిగా మార్చి కోతికే పలు నీతులు నేర్పి 
రాతినే ఇల నాతిగా మార్చి కోతికే పలు నీతులు నేర్పి 
మహిమలెన్నో చూసిన దేవా మము బ్రోవా రాలేవా 
రాతినే ఇల నాతిగా మార్చి కోతికే పలు నీతులు నేర్పి 
మహిమలెన్నో చూసిన దేవా మము బ్రోవా రాలేవా 


శ్రీరామ నీ నామమెంతో రుచిరా 
ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా 
శ్రీరామ నీ నామమెంతో రుచిరా 

శ్రీరామా .. శ్రీరామా 
హే శ్రీరామా..శ్రీ రామా 
జై ఓ రామా.. శ్రీ రామా 
శ్రీరామా .. శ్రీరామా 
హే శ్రీరామా..శ్రీ రామా 
జై ఓ రామా.. శ్రీ రామా 
జై ఓ రామా.. శ్రీ రామా 

శ్రీమద్రమారామణ... గోవిందో... హారి

No comments:

Post a Comment