Monday, September 10, 2012

అనురాగ సీమ మనమేలుదామా

చిత్రం: కనక దుర్గ పూజా మహిమ (1960)
సంగీతం: రాజన్-నాగేంద్ర
గీతరచయిత: జి.కృష్ణమూర్తి
నేపధ్య గానం: పి. బి. శ్రీనివాస్, జిక్కి

పల్లవి:

అనురాగ సీమ... మనమేలుదామా
ఆనందాల... చవిచూదమా
మేఘాల తేలాడి ఓలాడుదామా
మెరిసే ధరణీ... మనదే సుమా

అనురాగ సీమ... మనమేలుదామా
ఆనందాల... చవిచూదమా
ఓ హొహొహో...అహహ...అహహ...అహహా...

చరణం 1:

ఎగిరేటి ఎలసేటి గీతాలు మ్రోగే
చిగురాకు పూబాలలూగే
ఆ....ఆ... ఆ...
ఎగవోలె చిరుగాలి పారాడి సాగే
కెరటాలు కోనేట తూగే

ఓ... మధురానుభవమే ఈ జగానా..
మధుమాసమై నేడు శోభించెనా...
ఇలనిండె వలపు ఈ దినానా...
కలలన్ని కనులార కాంతుమా...

అనురాగ సీమ... మనమేలుదామా
ఆనందాల చవి చూదమా

చరణం 2:

నెలరాజు నేడేల కనరాక మానే
నీ మోము తిలకించి తలదించెనే....
ఓ...ఆ...ఆ....
పలికేటి చిలుకేల తన పాట మానే
కలకంఠి నీ కంఠమాలించెనే...

కులికింది కళలా ఈ లోకమెల్లా...
పులకించె నిలువెల్ల గిలిగింతలా...
మనలోని ప్రేమా... ఎనలేని ప్రేమా
మనసార తనిదీర సేవింతుమా

అనురాగ సీమ... మనమేలుదామా
ఆనందాల... చవి చూదమా
మేఘాల తేలాడి ఓలాడుదామా
మెరిసే ధరణీ మనదే సుమా

అనురాగ సీమ మనమేలుదామా
ఆనందాల చవి చూదమా
అహా హా హా ...
ఓహో ఓ హో హో హొ హో....

No comments:

Post a Comment