Saturday, December 15, 2012

ఎలా ఎలా దాచావు

చిత్రం: గోరింటాకు (1979)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: దేవులపల్లి
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:

ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం...ఇన్నాళ్ళూ...ఇన్నేళ్ళూ

ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం...ఇన్నాళ్ళూ...ఇన్నేళ్ళూ..
ఇన్నాళ్ళూ...ఇన్నేళ్ళూ....

చరణం 1:

పిలిచి పిలిచినా..పలుకరించినా ..పులకించదు కదా నీ ఎదా
ఉసురొసుమనినా...గుసగుసమనినా ఊగదేమది నీ మది...

నిదుర రాని నిశిరాతురులెన్నో...నిట్టూరుపులెన్నో...
నోరులేని ఆవేదనలెన్నో...ఆరాటములెన్నో...

ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం...ఇన్నాళ్ళూ...ఇన్నేళ్ళూ..
ఇన్నాళ్ళూ...ఇన్నేళ్ళూ....

చరణం 2:

తలుపులు తెరుచుకొని వాకిటనే నిలబడతారా ఎవరైనా?
తెరిచి ఉందనీ వాకిటి తలుపు... చొరబడతారా ఎవరైనా?

దొరవో... మరి దొంగవో
దొరవో... మరి దొంగవో
దొరికావు ఈనాటికీ....

దొంగను కానూ...దొరనూ కానూ..
దొంగను కానూ...దొరనూ కానూ...నంగనాచినసలే కానూ....

ఎలా ఎలా దాచావు
అలవి కాని అనురాగం...ఇన్నాళ్ళూ...ఇన్నేళ్ళూ

No comments:

Post a Comment