Sunday, December 9, 2012

సిరి సిరి మువ్వలు

చిత్రం: గణేష్ (1998) 
సంగీతం: మణిశర్మ 
గీతరచయిత: సిరివెన్నెల 
నేపధ్య గానం: బాలు 

పల్లవి: 

సిరి సిరి మువ్వలు ఆ విరిసిన పువ్వులు 
చిరు చిరు ఆశలు ఈ గల గల ఊసులు 
కలబోసి చేసినవీ కిల కిల నవ్వులు 
వెలపోసి ఈ సిరులు కొనలేరెవ్వరు 
దేవుడే ఆ దివి నుండి పంపిన దీవెనలు 
ఎప్పుడూ ఈ కోవెలలో వెలిగే దీపాలు 
సిరి సిరి మువ్వలు ఆ విరిసిన పువ్వులు 
చిరు చిరు ఆశలు ఈ గల గల ఊసులు 

చరణం 1: 

అల్లరంత సిరిమువ్వలై ఘల్లుఘల్లుమంటే 
నిలువలేక నిశ్శబ్దమే విసుగుపుట్టి పోదా 
సంతోషము కూడా తనకి చిరునామా అవ్వాలనీ 
కన్నీరూ చేరుకుంది తెగ నవ్వే మన కళ్ళనీ 
ఈ మణి కాంతి వెలుగుతు ఉంటే.. 
ఈ మణి కాంతి వెలుగుతు ఉంటే చీకటి రాదే కన్నులకెదురుగా

No comments:

Post a Comment