చిత్రం: గణేష్ (2009)
సంగీతం: మిక్కి జె. మేయర్
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: జావేద్ అలీ
పల్లవి:
ఇవ్వాళ నాకు చాలా హ్యాపీగా ఉంది .. లైఫంతా నాతో ఇలాగే ఉంటావా?
తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా
మదేం విందో విందో లేదో కలేం కాదే ఇదంతా
ఇంతలోనే అంత మైకం పనికిరాదే ప్రాణమా
పరవశంలో మునిగిపోతే పైకి రాగలమా
తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా
మదేం విందో విందో లేదో కలేం కాదే ఇదంతా
చరణం 1:
కుడివైపున ఇంకో హృదయం ఉన్నా సరిపోదో ఏమో
ఈ వెలుగును దాచాలంటే
పడమరలో నైనా ఉదయం ఈ రోజే చూసానేమో
మనసంతా ప్రేమైపోతే
ఎగిరొచ్చిన ఏదో లోకం నా చుట్టు వెలిసిందేమో
మైమరపున నే నిలుచుంటే
ఇంతలోనే అంత మైకం పనికిరాదే ప్రాణమా
పరవశంలో మునిగిపోతే పైకి రాగలమా
తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా
మదేం విందో విందో లేదో కలేం కాదే ఇదంతా
చరణం 2:
ఇదే క్షణం శిలై నిలవనీ
సదా మనం ఇలా మిగలనీ
జన్మంటే ఇదంటూ తెలీదే ఇన్నాళ్ళు
నీ జంటై ఇవ్వాళే జీవించా నూరేళ్ళు
తనేమందో......మదేం విందో
తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా
మదేం విందో విందో లేదో కలేం కాదే ఇదంతా
ఇంతలోనే అంత మైకం పనికిరాదే ప్రాణమా
పరవశంలో మునిగిపోతే పైకి రాగలమా
తనేమందో అందో లేదో తెలీలేదే నిజంగా
మదేం విందో విందో లేదో కలేం కాదే ఇదంతా
No comments:
Post a Comment