Tuesday, December 4, 2012

నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా

చిత్రం: కాంచన గంగ (1984)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: సినారె
నేపధ్య గానం: బాలు, జానకి

పల్లవి:

నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా
లలలలా లలలాలాలా లలలల
నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రావమ్మా
లాలలా లా ఆ ఆ ఆ...
నీవే నీవే నా ఆలాపనా
నీలో నేనే ఉన్నా

నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా
నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రావమ్మా

చరణం 1:

నీ అందమే... అరుదైనదీ
నా కోసమే నీవున్నదీ
హద్దులు చెరిపేసి చిరుముద్దులు కలబోసీ
హద్దులు చెరిపేసి చిరుముద్దులు కలబోసీ
పగలు రేయి ఊగాలమ్మా పరవళ్ళలో 


నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా 
నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రావమ్మా 

చరణం 2:

ఆ... ఆ... ఆ...
ఏ గాలులూ నిను తాకినా
నా గుండెలో ఆవేదనా
వలపే మన సొంతం
ప్రతిమలుపూ రసవంతం
వలపే మన సొంతం
ప్రతిమలుపూ రసవంతం
కాగే విరహం కరగాలమ్మా కౌగిళ్ళలో


నీ తీయని పెదవులు అందకపోతే నిదరే రాదమ్మా 
నీ కాటుక కళ్ళే నవ్వకపోతే కలలే రావమ్మా 

No comments:

Post a Comment