Tuesday, December 4, 2012

ఓ ప్రియతమా నా గగనమా

చిత్రం: కాంచన గంగ (1984)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, జానకి

పల్లవి:

ఆఁహా ఆఁహ లలలలలల లలలలలల
లలల లలల లలల లలల లలల లలల లా...

ఓ ప్రియతమా... నా గగనమా
ఇంద్రుడెవ్వరూ... చంద్రుడెవ్వరూ
సిరిగల మగసిరి నీ జంటలో

ఓ ప్రియతమా... నా భువనమా
నవ్వులుండగా... మల్లెలెందుకూ
సిరిగల సొగసరి నీ జంటలో...

చరణం 1:

లేత రంగు నీలి మబ్బు చీర కట్టుకొస్తా
తారలన్ని కోసుకొచ్చి తోరణలు చేస్తా
చందమామ సాన మీద చందనాలు తీస్తా
ఎండ వెండి మువ్వలన్ని నీకు దండలేస్తా

నవ్వులోని రవ్వలన్ని దోచుకుంటే... వద్దంటూనే వడ్డించేది ఎలా?
నీ నోటి ముత్యాలు రాలవులే హే..

చరణం 2:

ఓ ప్రియతమా... నా గగనమా
ఇంద్రుడెవ్వరూ... చంద్రుడెవ్వరూ
సిరిగల మగసిరి నీ జంటలో

ఓ ప్రియతమా... నా భువనమా
రంభ ఎందుకూ... ఊర్వశెందుకూ
సిరిగల సొగసరి నీ జంటలో...

చరణం 3:

కొంగులేని క్రొత్త ఈడు కోక పట్టి చూడు
ముద్దులన్ని మూటబెట్టి ముందు ముచ్చటాడు
వానవిల్లు చీరలోని వన్నెలేమో ఏడు
చిన్నదాని చీరకున్న మూరలేమో మూడు

చెంపలోని కెంపులన్ని రాలకుండా... వయ్యారాలే వడ్డించే వేళా
ఆరారు కాలాలు చాలవులే... హే..

ఓ ప్రియతమా... నా గగనమా
రంభ ఎందుకూ... ఊర్వశెందుకూ
సిరిగల సొగసరి నీ జంటలో...

No comments:

Post a Comment