Tuesday, December 11, 2012

నువ్వునా ముందుంటే

చిత్రం: గూఢచారి 116 (1966) 
సంగీతం: టి. చలపతిరావు 
గీతరచయిత: సినారె 
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల 

పల్లవి: 

నువ్వునా ముందుంటే..నిన్నలా చూస్తుంటే 
జివ్వుమంటుంది మనసూ..రివ్వుమంటుంది వయసూ 

నువ్వునా ముందుంటే..నిన్నలా చూస్తుంటే 
జివ్వుమంటుంది మనసూ..రివ్వుమంటుంది వయసూ 

చరణం 1: 

ముద్దబంతిలా వున్నావూ..ముద్దులొలికిపోతున్నావూ 
ముద్దబంతిలా వున్నావూ..ముద్దులొలికిపోతున్నావూ 
జింకపిల్లలా ..చెంగుచెంగుమని.. చిలిపి సైగలే చేసేవూ... 

నువ్వునా ముందుంటే..నిన్నలా చూస్తుంటే 
జివ్వుమంటుంది మనసూ..రివ్వుమంటుంది వయసూ 

చరణం 2: 

చల్లచల్లగా రగిలించేవూ..మెల్లమెల్లగా పెనవేసేవూ 
చల్లచల్లగా రగిలించేవూ..మెల్లమెల్లగా పెనవేసేవూ 
బుగ్గపైన ..కొనగోటమీటి.. సిగ్గుదొంతరలు దోచేవూ ... 

నువ్వునా ముందుంటే..నిన్నలా చూస్తుంటే 
జివ్వుమంటుంది మనసూ..రివ్వుమంటుంది వయసూ 

చరణం 3: 

లేతలేతగా నవ్వేవూ..లేని కోరికలు రువ్వేవూ 
లేతలేతగా నవ్వేవూ..లేని కోరికలు రువ్వేవూ 
మాటలల్లి ..మరుమందుచల్లి.. నను మత్తులోన పడవేసేవూ

నువ్వునా ముందుంటే..నిన్నలా చూస్తుంటే 
జివ్వుమంటుంది మనసూ..రివ్వుమంటుంది వయసూ

No comments:

Post a Comment