చిత్రం: గూడుపుఠాణి (1972)
సంగీతం: కోదండపాణి
గీతరచయిత: దాశరథి
నేపథ్య గానం: బాలు, సుశీల
పల్లవి :
తనివి తీరలేదే … నా మనసు నిండలేదే
ఏనాటి బంధమీ అనురాగం
తనివి తీరలేదే … నా మనసు నిండలేదే
ఏనాటి బంధమీ అనురాగం
చెలియా ఓ చెలియా
చరణం 1:
ఎన్నో వసంతవేళలలో వలపుల ఊయలలూగామే
ఎన్నో వసంతవేళలలో వలపుల ఊయలలూగామే
ఎన్నో పున్నమిరాత్రులలో వెన్నెల జలకాలాడేమే
అందని అందాల అంచుకే చేరిననూ
అందని అందాల అంచుకే చేరిననూ
విరిసిన పరువాల లోతులే చూసిననూ
తనివి తీరలేదే... నా మనసు నిండలేదే
ఏనాటి బంధమీ అనురాగం
తనివి తీరలేదే... నా మనసు నిండలేదే
ఏనాటి బంధమీ అనురాగం
ప్రియతమా… ఓ ప్రియతమా
చరణం 2:
ఎప్పుడు నీవే నాతో ఉంటే... ఎన్ని వసంతాలైతేనేమి
ఎప్పుడు నీవే నాతో ఉంటే... ఎన్ని వసంతాలైతేనేమి
కన్నుల నీవే కనబడుతుంటే... ఎన్ని పున్నమలు వస్తేనేమి
వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించిననూ
వెచ్చని కౌగిలిలో హాయిగా కరిగించిననూ
తీయని హృదయంలో తేనెలే కురిపించిననూ
తనివి తీరలేదే... నా మనసు నిండలేదే
ఏనాటి బంధమీ అనురాగం
No comments:
Post a Comment