Sunday, December 9, 2012

ఎందుకమ్మ ప్రేమ ప్రేమ

చిత్రం: గాయం-2 (2010)
సంగీతం: ఇళయరాజా
గీతరచయిత: అనంత శ్రీరామ్
నేపధ్య గానం: శ్రీరామ్ పార్థసారథి, గీతా మాధురి

పల్లవి:

ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనె ఆగేవమ్మా రా
సందె వేళ అయ్యిందమ్మా సంతకాలు చెయ్యాలమ్మా రా
వెంట వెంటనే అన్నీ అందుకోగరా.. జంట వింతలే ఎన్నో చూసుకోగరా
ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనె ఆగేవమ్మా రా
సందె వేళ అయ్యిందమ్మా సంతకాలు చెయ్యాలమ్మా రా

చరణం 1:

నిన్ను నన్ను దూరం చేసే చెయ్యి లేదనీ
నీకు నాకు చేరువ పెంచే చూపు ఉందనీ
నిన్ను నన్ను దూరం చేసే చెయ్యి లేదనీ..
నీకు నాకు చేరువ పెంచే చూపు ఉందనీ
చాటుమాటులో సరసం చాలదీ పని
గోటి రాతలే కవితై నీకు తోచనీ
తెలిపేందుకు వస్తున్నా.. తెలిసిందని కనుగొన్నా..
కొరికేసే కల నువ్వై రారా... హహాహాహా..

ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనె ఆగేవమ్మా రా
సందె వేళ అయ్యిందమ్మా సంతకాలు చెయ్యాలమ్మా రా

చరణం 2:

చిన్న చోటులోనే అందే పెద్ద హాయిని
ఆడుతున్న ఇద్దరు గెలిచే వింత ఆటని
చిన్న చోటులోనే అందే పెద్ద హాయిని...
ఆడుతున్న ఇద్దరు గెలిచే వింత ఆటని
పొందకుంటే ఈ మాత్రం జన్మ ఎందుకో
ఆడకుంటే ఈ ఆత్రం ఇక్కడెందుకో
అడగాలని అనుకున్నా.. అటు నీ కసి కనుగొన్నా..
ఇది నీదే ఇక ఏదేమైనా... హాహాహాహా...
ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనె ఆగేవమ్మా రా
సందె వేళ అయ్యిందమ్మా సంతకాలు చెయ్యాలమ్మా రా
వెంట వెంటనే అన్నీ అందుకోగరా ..జంట వింతలే ఎన్నో చూసుకోగరా
ఎందుకమ్మ ప్రేమ ప్రేమ గుండెలోనె ఆగేవమ్మా రా
సందె వేళ అయ్యిందమ్మా సంతకాలు చెయ్యాలమ్మా రా

No comments:

Post a Comment