Tuesday, December 4, 2012

సింధూరపూ పూదోటలో

చిత్రం: కిల్లర్ (1993) 
సంగీతం: ఇళయరాజా 
గీతరచయిత: వేటూరి 
నేపధ్య గానం: బాలు, చిత్ర 

పల్లవి: 

ఊఁహూఁ.. ఊఁహూఁ.. ఊఁ.. 
ఊఁహూఁహూఁ.. ఊఁ.. 
ఊఁహూఁ.. ఊఁహూఁ.. ఊఁ.. 
ఊఁహూఁహూఁ.. ఊఁ.. 

సింధూరపూ.. పూదోటలో.. చిన్నారి ఓ పాపా 
ఏ పాపమో.. ఆ తోటలో.. వేసిందిలే పాగా 
ఏమని నే పాడనులే 
ప్రేమకు తానోడెనులే..ఏ..ఏ.. 
ఆ కథ ఎందుకులే..ఏ.. 

సింధూరపూ పూదోటలో.. చిన్నారి ఓ పాపా 

చరణం 1: 

తనువే.. కధలల్లే.. కనుపాపే నా బొమ్మగా 
మనసే.. తెరతీసే.. పసిపాపే మా అమ్మగా 
కనులు పగలు కాసే.. చల్లని వెన్నెల కాగా 
చిలక పలకగానే.. గూటికి గుండెలు మ్రోగ 
విధి చదరంగంలో.. విష రణరంగంలో 
గెలవలేని ఆటే.. ఎన్నడు పాడని పాట 

సింధూరపూ.. పూదోటలో.. చిన్నారి ఓ పాపా 
ఏ పాపమో.. ఆ తోటలో.. వేసిందిలే పాగా 

చరణం 2: 

రాబందే కాదా.. ఆ రామయ్యకు బంధువు 
సీతమ్మను విరహాలే.. దాటించిన సేతువు 
కోవెల చేరిన దీపం.. దేవుడి హారతి కాదా 
చీకటి మూగిన చోటే.. వేకువ వెన్నెల రాదా 
ఈతడు మా తోడై.. ఈశ్వరుడే వీడై.. 
కలిసి ఉంటే చాలూ.. వేయి వసంతాలూ 

సింధూరపూ.. పూదోటలో.. చిన్నారి ఓ పాపా 
పాపనికే.. మా తోటలో.. లేదందిలే జాగా 

ఏమని నే పాడనులే 
ప్రేమకు తానోడెనులే..ఏ..ఏ.. 
ఆ కథ ఎందుకులే..ఏ.. 

సింధూరపూ.. పూదోటలో.. చిన్నారి ఓ పాపా 
ఏ పాపమో.. ఆ తోటలో.. వేసిందిలే పాగా

No comments:

Post a Comment