Wednesday, December 5, 2012

ఊగిసలాడకే మనసా

చిత్రం: కొత్త నీరు (1981)
సంగీతం: రమేశ్ నాయుడు
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: ఎస్. పి. శైలజ

పల్లవి:

ఊగిసలాడకే మనసా.. నువ్వు ఉబలాట పడకే మనసా
ఊగిసలాడకే మనసా.. నువ్వు ఉబలాట పడకే మనసా
ఊసుపోలేదనో..ఓ.. ఆశగా ఉందనో..ఓ..
ఉర్రూతలూగకే మనసా..ఆ..ఆ..

ఊగిసలాడకే మనసా.. నువ్వు ఉబలాట పడకే మనసా

చరణం 1:

తలలోన ముడిచాక.. విలువైన పువ్వైనా.. దైవ పూజకు తగదు మనసా
దైవ పూజకు తగదు మనసా..
పొరపాటు చేశావో దిగజారిపోతావు.. నగుబాటు తప్పదు మనసా
పెడదారి మురిపాలు.. మొదటికే మోసాలు.. చాలు నీ వేషాలు మనసా
చాలు.. నీ వేషాలు మనసా..

ఊగిసలాడకే మనసా.. నువ్వు ఉబలాట పడకే మనసా..

చరణం 2:

తుమ్మెదలు చెలరేగి.. తోటలో ముసిరేను.. దిమ్మరిని నమ్మకే మనసా
దేశ దిమ్మరిని నమ్మకే మనసా..
చపల చిత్తం విపరీతమౌతుంది.. చలియించకే వెర్రి మనసా
కపటాలు సరదాలు.. కవ్వించు సరసాలు.. కాలు జారేనేమో మనసా
కాలు.. జారేనేమో మనసా..

ఊగిసలాడకే మనసా.. నువ్వు ఉబలాటపడకే మనసా
ఊసుపోలేదనో..ఓ.. ఆశగా ఉందనో..ఓ..
ఉర్రూతలూగకే మనసా..ఆ..ఆ..
ఊగిసలాడకే మనసా.. నువ్వు ఉబలాటపడకే మనసా

No comments:

Post a Comment