Monday, December 10, 2012

చిలకమ్మ ముక్కుకి

చిత్రం: గుడుంబా శంకర్ (2004)
సంగీతం: మణిశర్మ
గీతరచయిత: చంద్రబోస్
నేపధ్య గానం: కార్తీక్, శ్రీవర్ధిని, హనుమంతరావు

పల్లవి:

చిలకమ్మ ముక్కుకి దొండపండుకి ఏనాడో రాసి పెట్టుంది
కాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుంది
అరె ఆశే ఉంటే అంతో ఇంతో అంతేనండి మరి రాసే ఉంటే అంతా సొంతం అయ్యేనండి
ఆ వీరబ్రహ్మం ఆనాడిదే అన్నాడండి మన పరబ్రహ్మం మళ్ళీ ఎటు ఉన్నాడండి

ఏవోవో ఏవో ఏవో ..ఉందోయ్ రాసి...ఏవోవో ఏవో ఏవో..
ఏవోవో ఏవో ఏవో ..లేదోయ్ రాజీ ... ఏవోవో ఏవో ఏవో..
చిలకమ్మ ముక్కుకి దొండపండుకి ఏనాడో రాసి పెట్టుంది
కాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుంది

చరణం 1:

సన్నాయే విరిగినా ఆ డోలే పగిలినా అయ్యే పెళ్ళాగునా రాసుంటే
పందిళ్ళే కూలినా బంధువులే పోయినా అయ్యే పెళ్ళాగునా రాసుంటే
చల్లే అక్షింతలు నిప్పులే ఐనా పెళ్ళాగదు రాసే ఉంటే
హే మెడ్లో పూమాలలు పాములే ఐనా పెళ్ళాగదు రాసే ఉంటే

ఏవోవో ఏవో ఏవో ..ఉందోయ్ రాసి...ఏవోవో ఏవో ఏవో
ఏవోవో ఏవో ఏవో..వద్దోయ్ పేచీ.. ఏవోవో ఏవో ఏవో
చిలకమ్మ ముక్కుకి దొండపండుకి ఏనాడో రాసి పెట్టుంది
కాకమ్మ మూతికి కాకరకాయకి ఆనాడే రాసి పెట్టుంది

చరణం 2:

తిక్కన్నే వచ్చినా ఎర్రన్నే వచ్చినా జరిగే కథ మారునా రాసుంటే
గురుడే బోధించినా వరుడే పాటించినా జరిగే కథ మారునా రాసుంటే
సింహం ఓ పక్క నక్క ఓ పక్క కథ మారదు రాసే ఉంటే
పెళ్ళాం ఓ పక్క పళ్ళెమోపక్క కథ మారదు రాసే ఉంటే

ఏవోవో ఏవో ఏవో..ఉందోయ్ రాసి...ఏవోవో ఏవో ఏవో
ఏవోవో ఏవో ఏవో.. బ్రతుకే చీచీ...ఏవోవో ఏవో ఏవో

అరె ఆశే ఉంటే అంతో ఇంతో అంతేనండి మరి రాసే ఉంటే అంతా సొంతం అయ్యేనండి
ఆ వీరబ్రహ్మం ఆనాడిదే అన్నాడండి మన పరబ్రహ్మం మళ్ళీ ఎటు ఉన్నాడండి

ఏవోవో ఏవో ఏవో.. ఉందోయ్ రాసి... ఏవోవో ఏవో ఏవో
ఏవోవో ఏవో ఏవో..లేదోయ్ రాజీ ... ఏవోవో ఏవో ఏవో

No comments:

Post a Comment