Wednesday, December 5, 2012

మంచుకొండల్లోన ఎండకాసినట్టుచిత్రం: కృష్ణార్జునులు (1982)
సంగీతం: సత్యం
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:

మంచుకొండల్లోన ఎండకాసినట్టు
మల్లెపూలు జల్లె ఎన్నెల
పిల్లదాని వాలుకన్నుల
మంచుకొండల్లోన ఎండకాసినట్టు
మల్లెపూలు జల్లె ఎన్నెల
పిల్లదాని వాలుకన్నుల

మంచుకొండల్లోన ఎండకాసినట్టు
మల్లెపూలు జల్లె ఎన్నెల
ఎన్నెలమ్మ ఎండికన్నుల
మంచుకొండల్లోన ఎండకాసినట్టు
మల్లెపూలు జల్లె ఎన్నెల
ఎన్నెలమ్మ ఎండికన్నుల
ఓ ఓ....

చరణం 1:

వెలుతురు తొటలో మిణుగురు పాటలా
వెలుతురు వేణువూదెనే ఎన్నెలా
తిమ్మెర వీణ మీటెనే
వెలుతురు తొటలొ మిణుగురు పాటలా
వెలుతురు వేణువూదెనే ఎన్నెలా
తిమ్మెర వీణ మీటెనే

ఆ నిదరమ్మ ముదరేసె కలల అలల వెల్లువలొ

చరణం 2:

వణికిన పెదవులా తొణికిన మధువులా
పొగడలు కొండలాయనే ఎన్నెల
మనుగడ మీగడయెనే
వణికిన పెదవులా తొణికిన మధువులా
పొగడలు కొండలాయనే ఎన్నెల
మనుగడ మీగడయెనే

ఇద్దరయిన ముద్దులమ్మ వలపు అలల అల్లికలొ

మంచుకొండల్లోన ఎండకాసినట్టు
మల్లెపూలు జల్లె ఎన్నెల
ఎన్నెలమ్మ ఎండికన్నుల

మంచుకొండల్లోన ఎండకాసినట్టు
మల్లెపూలు జల్లె ఎన్నెల
పిల్లదాని వాలుకన్నులhttp://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3781

No comments:

Post a Comment