Sunday, December 9, 2012

లల్లలై లైలా మజ్నూ

చిత్రం: గణేష్ (2009) 
సంగీతం: మిక్కి జె. మేయర్ 
గీతరచయిత: రామజోగయ్య శాస్త్రి 
నేపధ్య గానం: కృష్ణ చైతన్య , శ్వేతా పండిట్ 

పల్లవి: 

కొక్కొరో..రో .. తూతతూ .. తూతూ 

లల్లలై లైలా మజ్నూ మనమేనంటూ ఫీలైపోదాం 
లల్లలై LOVE మీనింగ్ ఏంటొ కనిపెడదాం 
లల్లలై నువ్వు నేను ఇద్దరమంటే కాదని అందాం 
లల్లలై నువ్వే నేనై నేనే నువ్వై కనపడదాం 
మనం ఒకటైతే సరిపోదే మన నీడలనేం చేద్దాం 
వాటిని పక్కన నిలిపి ఒకటిగ కలిపి ప్రేమని పేరెడదాం 

లల్లలై లైలా మజ్నూ మనమేనంటూ ఫీలైపోదాం 
లల్లలై నువ్వే నేనై నేనే నువ్వై కనపడదాం 

చరణం 1: 

నీ ఒంటి మీద చోటు చూసుకుంటా 
చిన్న పుట్టుమచ్చలాగ అంటుకుంటా 
రోజుకొక్క మాటు నువ్వు నన్ను తానాల వేళలోన ముట్టుకుంటే చాలునంట 
పచ్చబొట్టులాగ నేను మారిపోతా 
వెచ్చనైన ఛాతి పైన వాలిపోతా 
లాలి పాడు గుండే లాయి లాయి లల్లాయి హాయిలొన చందనాలు చల్లుకుంటా 

నీ నడువంపున మెలికై ఉంటా 
నీ జడ పాయ నలుపైపోతా 
నీ లోలాకు తళుకై ఉంటా 
నీ చేతికున్న గాజునై గలగలమంటా 

కొంటె దిగులంతా పలికిందా నీ వయసున గిలిగింతా 
తీగలాగిందే నువ్వని తొణికిందేమో పెంచిన ప్రేమంతా 

లల్లలై లైలా మజ్నూ మనమేనంటూ ఫీలైపోదాం 
లల్లలై LOVE మీనింగ్ ఏంటొ కనిపెడదాం 

చరణం 2: 

నువ్వు పిల్లిమొగ్గ వెయ్యమంటే రడీ 
ఎత్తు కొండలెక్కి దూకమంటె రడీ 
కన్నె కంటి సైగ చెప్పినట్టు తూచాలు తప్పకుండా చేసుకుంటా ప్రేమ సందడీ 

నువ్వు గాలి ముద్దు పెట్టుకుంటే రడీ 
తేనెవిందులోకి దించుకుంటే రడీ 
నిన్ను రాసుకుంటూ పూసుకుంటూ రాగాలు తీసుకుంటూ పాడుకుంటా ప్రేమ మెలోడీ 

నువ్వేదంటే అవునని అంటా నీ పెదవంచు నవ్వై ఉంటా 
నీ అరచేత పువ్వై ఉంటా నా తూరుపెక్కడున్నదంటే నిన్ను చూపిస్తా 
కట్టు తెర తీస్తా ఎదురొస్తా నువ్వు కోరిన అలుసిస్తా 
అందుకే రేయీ పగలు రెప్పలు కాస్తూ నీ కోసం చూస్తా 

లల్లలై లైలా మజ్నూ మనమేనంటూ ఫీలైపోదాం 
లల్లలై LOVE మీనింగ్ ఏంటొ కనిపెడదాం 
లల్లలై నువ్వు నేను ఇద్దరమంటే కాదని అందాం 
లల్లలై నువ్వే నేనై నేనే నువ్వై కనపడదాం

No comments:

Post a Comment