Sunday, December 9, 2012

నంది కొండ వాగుల్లోనా

చిత్రం: గీతాంజలి (1989) 
సంగీతం: ఇళయరాజా 
గీతరచయిత: వేటూరి 
నేపథ్య గానం: బాలు, చిత్ర 

పల్లవి: 

ఓ..ఓ...ఓ....ఓ...ఓ...ఓ 
నంది కొండ వాగుల్లోనా… 
నల్ల తుమ్మ నీడల్లో 
చంద్ర వంక కోనల్లోనా... 
సందె పొద్దు సీకట్లో… 
నీడల్లే వున్నా… నీతో వస్తున్నా… 
నా వూరేది… ఏదీ… 
నా పేరేది..... ఏదీ 
నా దారేది... ఏదీ... 
నా వారేరి...ఉ హ..హా..... 

ఓ..ఓ...ఓ....ఓ...ఓ...ఓ 

చరణం 1: 

ఏనాడో ఆరింది నా వెలుగు… 
నీ దరికే నా పరుగూ… 
ఆనాడే కొరాను నీ మనసు… 
నీ వరమే నన్నడుగూ… 

మోహినీ పిశాచి నా చెలిలే 
షాకినీ విషూచీ నా సఖిలే 
మోహినీ పిశాచి నా చెలిలే 
షాకినీ విషూచీ నా సఖిలే 

విడవకురా… వదలను రా… 
ప్రేమే రా నీ మీదా 

నందికొండ వాగుల్లోనా 
నల్ల తుమ్మ నీడల్లో 

చరణం 2: 

భూత ప్రేత పిశాచ భేతాళ 
మారీచం... దం… ఝడం భం భం 

నంది కొండ వాగుల్లోనా… 
నల్ల తుమ్మ నీడల్లో 
చంద్ర వంక కోనల్లోనా 
సందె పొద్దు సీకట్లో… 
నీడల్లే వున్నా… నీతో వస్తున్నా… 

నీ కబళం పడతా నిను కట్టుకుపోతా 
నీ భరతం పడతా నిను పట్టుకుపోతా 

ఆఆ... ఆఆ... ఓఓ... ఓఓ... 

చరణం 3: 

ఢాకిని ఢక్క ముక్కల చెక్క… 
డంబో తినిపిస్తాన్… 
తాటకి వనిపిస్తే… 
తాటలు వలిచేస్తాన్… 
తుంటరి నక్క డొక్కలొ చొక్క… 
అంభో అనిపిస్తాన్… 
నక్కను తొక్కిస్తాన్… 
చుక్కలు తగ్గిస్తాన్… 
రక్కిస మట్టా… 
తొక్కిస గుట్ట పంబే ధులిపేస్తాన్… 
తీతువు పిట్టా ఆయువు చిట్టా నేనే తిరగేస్తాన్… 
రక్కసి మట్టా… 
తొక్కిస గుట్ట పంబే ధులిపేస్తాన్… 
తీతువు పిట్టా ఆయువు చిట్టా నేనే తిరగేస్తాన్… 
అస్తాయా ఫట్ ఫట్ ఫట్ ఫట్... 
వస్తాయా ఝట్ ఝట్ ఝట్… ఫట్ … 
భోపాలా మసజస తతగా… శార్దూలా 

నంది కొండ వాగుల్లోనా… 
నల్ల తుమ్మ నీడల్లో 
చంద్ర వంక కోనల్లోనా 
సందె పొద్దు సీకట్లో… 
నీడల్లే వున్నా… నీతో వస్తున్నా… 

నీ కబళం పడతా నిను కట్టుకుపోతా 
నీ భరతం పడతా నిను పట్టుకుపోతా 

ఆఆ... ఆఆ... ఓఓ... ఓఓ... 

నంది కొండ వాగుల్లోనా… 
నల్ల తుమ్మ నీడల్లో 
చంద్ర వంక కోనల్లోనా 
సందె పొద్దు సీకట్లో…

No comments:

Post a Comment