Tuesday, January 29, 2013

కలువకు చంద్రుడు ఎంతో దూరం

చిత్రం: చిల్లర దేవుళ్ళు (1975)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: బాలు

పల్లవి:

కలువకు చంద్రుడు ఎంతో దూరం..
కమలానికి సూర్యుడు మరీ దూరం..

కలువకు చంద్రుడు ఎంతో దూరం..
కమలానికి సూర్యుడు మరీ దూరం..

దూరమైన కొలదీ.. పెరుగును అనురాగం..
దూరమైన కొలదీ.. పెరుగును అనురాగం..
విరహంలోనే వున్నది అనుబంధం..
కలువకు చంద్రుడు ఎంతో దూరం..
కమలానికి సూర్యుడు మరీ దూరం

చరణం 1:

నవ్వు నవ్వుకు తేడా వుంటుందీ..
నవ్వే అదృష్టం ఎందరికుంటుంది ??
ఏ కన్నీరైనా వెచ్చగ వుంటుందీ..
అది కలిమిలేములను మరిపిస్తుంది..

కలువకు చంద్రుడు ఎంతో దూరం..
కమలానికి సూర్యుడు మరీ దూరం

చరణం 2:

వలపు కన్నా తలపే తీయనా...
కలయక కన్నా కలలే తీయనా..
చూపులకన్నా ఎదురు చూపులే తీయనా...
నేటికన్న రేపే తీయనా..

కలువకు చంద్రుడు ఎంతో దూరం..
కమలానికి సూర్యుడు మరీ దూరం

చరణం 3:

మనసు మనిషిని మనిషిగ చేస్తుందీ..
వలపా మనసుకు అందానిస్తుంది..
ఈ రెండూ లేక జీవితమేముంది??
ఆ దేవుడికి.. మనిషికి.. తేడా ఏముంది??

కలువకు చంద్రుడు ఎంతో దూరం..
కమలానికి సూర్యుడు మరీ దూరం
దూరమైన కొలదీ.. పెరుగును అనురాగం..
విరహంలోనే వున్నది అనుబంధం..
కలువకు చంద్రుడు ఎంతో దూరం..
కమలానికి సూర్యుడు మరీ దూరం

No comments:

Post a Comment