చిత్రం: చిల్లర దేవుళ్ళు (1975)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: బాలు
పల్లవి:
ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ...
పాడాలనే ఉన్నది.. విని మెచ్చి.. మనసిచ్చే మనిషుంటే..
పాడాలనే ఉన్నది.. విని మెచ్చి.. మనసిచ్చే మనిషుంటే...ఏ..ఏ..
పాడాలనే ఉన్నది..
చరణం 1:
పాడాలంటే హృదయం ఉండాలి
పాడాలంటే హృదయం ఉండాలి
హృదయానికి ఏదో ఒక కదలిక రావాలి
భావం పొంగాలి.. రాగం పలకాలి.. దానికి జీవం పోయాలి
భావం పొంగాలి.. రాగం పలకాలి.. దానికి జీవం పోయాలి..ఈ..ఇ..ఇ....
పాడాలనే ఉన్నది.. విని మెచ్చి.. మనసిచ్చే మనిషుంటే...
పాడాలనే ఉన్నది..
చరణం 2:
పాడానంటే రాళ్ళే కరగాలి..ఆ రాళ్ళకు నోళ్ళొచ్చి కథలే చెప్పాలి..
పాడానంటే రాళ్ళే కరగాలి..ఆ రాళ్ళకు నోళ్ళొచ్చి కథలే చెప్పాలి..
ముసుగులు తొలగాలి.. మసకలు పోవాలి.. గదిలో దేవత కను తెరవాలి
పాడాలని ఉన్నది..
No comments:
Post a Comment