Tuesday, January 29, 2013

చూశాను పొద్దంతా వేచాను రాత్రంతా

చిత్రం: చీకటి వెలుగులు (1975) 
సంగీతం: చక్రవర్తి 
గీతరచయిత: సినారె 
నేపధ్య గానం: బాలు, సుశీల పల్లవి: 


హే...చూశాను పొద్దంతా.... 
చూశాను పొద్దంతా....వేచాను రాత్రంతా 
లోయలోనా సెలయేటి ధారలోనా 
నీ కోసం మామ్మజీ హాజీ మామాజీ 
హాజీ మామాజీ 

హే...చూశాను పొద్దంతా.... 
చూశాను పొద్దంతా....వేచాను రాత్రంతా 
కొండపైన చిగురాకు... 
కోనలోన... నీ కోసం....ఓ..బేబి..బేబి.. 
ఓ..బేబి...బేబి...ఓ..బేబి చరణం 1: 


ఒక మబ్బు తునకా...నా కురుల వెనకా 
ఊగింది...చెవిలో..ఊదింది... 

ఏమనీ...ఓ బేబి ఏమనీ 

నాలాగే కమ్ముకునే..నీవాడు ఏడనీ 
అడిగింది...ఆ మబ్బు తునకా 

ఒక పూలరెమ్మా.....అపరంగి బొమ్మా.... 
అడిగింది...తానే అడిగింది 

ఏమనీ...మామ్మాజీ ఏమనీ.... 
అహా...ఏమనీ...మామ్మాజీ ఏమనీ 

నా చిగురు చెంపల్లున్నా..నీ చెలియ ఏదనీ 
అడిగింది ఆ పూలరెమ్మా 
నా చిగురు చెంపల్లున్నా..నీ చెలియ ఏదనీ 
అడిగింది ఆ పూలరెమ్మా 

హే.. చూశాను పొద్దంతా....వేచాను రాత్రంతా 
లోయలోనా సెలయేటి ధారలోనా 
నీ కోసం మామ్మజీ హాజీ మామాజీ 
హాజీ మామాజీ చరణం 2: 


ఆ కొండ శిఖరం.... నీలాల గగనం 
అందుకొందీ.. నాతో అంటొందీ 
ఆ కొండ శిఖరం.... నీలాల గగనం 
అందుకొందీ..నాతో అంటొందీ 

హా...ఏమనీ...మమ్మాజీ.. ఏమనీ 
ఏమనీ...  ఓ బేబీ ఏమనీ 

తన లాగే మన వలపే....ఎదిగెదిగీ పోవాలనీ...
అంటుందీ ఆ కొండ శిఖరం
హే... చూశాను పొద్దంతా....వేచాను రాత్రంతా 
కొండపైన చిగురాకు... 
కోనలోన... నీ కోసం....ఓ..బేబి..బేబి.. 
ఓ..బేబి...బేబి...ఓ..బేబి http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=3585

No comments:

Post a Comment