Wednesday, January 30, 2013

ఆడవే మయూరీ

చిత్రం :  చెల్లెలి కాపురం (1971)
సంగీతం :  కె.వి. మహదేవన్
గీతరచయిత :  సినారె
నేపధ్య గానం :  బాలు


పల్లవి :


చరణకింకిణులు ఘల్లుఘల్లుమన..
కరకంకణములు గలగలలాడగ..
హ..హ..హ


అడుగులందు కలహంసలాడగా

నడుములో తరంగమ్ములూగగా

వినీల కచభర.. విలాస బంధుర.. తనూలతిక చంచలించిపోగా...


ఆడవే మయూరీ... నటనమాడవే మయూరీ..
నీ కులుకును గని నా పలుకు విరియ..
నీ నటనను గని నవకవిత వెలయగా..
ఆడవే మయూరీ... నటనమాడవే మయూరీ... ఆడవే మయూరీ


చరణం 1:


అది యమునా సుందర తీరమూ... అది రమణీయ బృందావనమూ..
అది విరిసిన పున్నమి వెన్నెలా... అది వీచిన తెమ్మెర ఊయలా..
అది చల్లని సైకత వేదికా.. అట సాగెను విరహిణి రాధికా..
అది రాధ మనసులో మాధవుడూదిన రసమయ మురళీ గీతికా..


ఆడవే మయూరీ.. నటనమాడవే మయూరీ..
నా పలుకులకెనయగు కులుకు చూపి..
నా కవితకు సరియగు నటన చూపి
ఇక ఆడవే మయూరీ... నటనమాడవే మయూరీ



చరణం 2 :


ఫాలనేత్ర సంప్రభవత్ జ్వాలలు ప్రసవశరుని దహియించగా..

పతిని కోలుపడి రతీదేవి దుఃఖిత మతియై రోదించగా..

హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమథగణము కనిపించగా

ప్రమథనాధ కర పంకజ భాంకృత ఢమరు ధ్వని వినిపించగా.. 


ప్రళయకాల సంకలిత భయంకర జలధరార్భుటుల చలిత

దిక్కుటుల జటిత దిక్కురుల వికృత ఘీంకృతుల సహస్ర ఫణ సంచలిత భూకృతుల..


కనులలోన.. కనుబొమలలోన... అధరమ్ములోన.. వదనమ్ములోన..
కనులలోన.. కనుబొమలలోన... అధరమ్ములోన.. వదనమ్ములోన..


గళసీమలోన.. కటిసీమలోనా.. కరయుగములోన.. పదయుగములోన...
నీ తనువులోని అణువణువులోన ..

అనంత విధముల అభినయించి ఇక ఆడవే....ఆడవే.. ఆడవే...





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2005

No comments:

Post a Comment