Wednesday, January 30, 2013

కనుల ముందు నీవుంటే

చిత్రం: చెల్లెలి కాపురం (1971)

సంగీతం : కె.వి. మహదేవన్

గీతరచయిత : సినారె

నేపధ్య గానం : బాలు, సుశీల



పల్లవి:


పరిమళించు వెన్నెల నీవే...మ్మ్

పలకరించు మల్లిక నీవే...మ్మ్

నా జీవన బృందావనిలో....మ్మ్

నడయాడే రాధిక నీవే.. 



కనుల ముందు నీవుంటేకవిత పోంగి పారదా.... మ్మ్

తొలి చిగురుల చూడగానే ....కల కోకిల కూయదా....మ్మ్



కనుల ముందు నీవుంటే.... కవిత పోంగి పారదా

తొలి చిగురుల చూడగానే ... కల కోకిల కూయదా....




చరణం 1:



అలనాటి జనకుని కోలువులో... తోలి సిగ్గుల మేలి ముసుగులో...

అలనాటి జనకుని కోలువులో... తోలి సిగ్గుల మేలి ముసుగులో...

ఆ..ఆ..రాముని చూసిన జానకివై

అభిరాముని వలపుల కానుకవై

వాల్మీకి కావ్య వాకిట వెలసిన.. వసంత మూర్తివి నీవే....


కనుల ముందు నీవుంటే... కవిత పోంగి పారదా....

తొలి చిగురుల చూడగానే.... కల కోకిల కూయదా....




చరణం 2:



అలనాటి సుందరవనములో... వనములో

ఎల ప్రాయం పోంగిన క్షణములో

అలనాటి సుందరవనములో.. ఎల ప్రాయం పోంగిన క్షణములో

ఆ..ఆ..రాజును కనిన శకుంతలవై

రతిరాజు భ్రమించిన చంచలవై

కాళిదాసు కల్పనలో మెరిసిన.. కమనీయ మూర్తివీవే



కనులముందు నీవుంటే... కవిత పోంగి పారదా

తొలి చిగురుల చూడగానే... కల కోకిల కూయదా....




చరణం 3:



అజంతా చిత్ర సుందరివై... ఎల్లోరా శిల్ప మంజరివై

అజంతా చిత్ర సుందరివై... ఎల్లోరా శిల్ప మంజరివై

రామప్ప గుడి మోమున విరిసిన.. రాగిణివై.. నాగినివై

అమరశిల్పులకు ఊపిరిలూదిన అమృతమూర్తివి నీవే



కనుల ముందు నీవుంటే... కవిత పోంగి పారదా

తోలి చిగురుల చూడగానే... కల కోకిల కూయదా





http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2356

No comments:

Post a Comment