చిత్రం: జగదేకవీరుని కథ (1961) సంగీతం: పెండ్యాల గీతరచయిత: పింగళి నేపధ్య గానం: ఘంటసాల పల్లవి : ఓ.....దివ్య రమణులారా ... నేటికి కనికరించినారా ....కలకాదు కదా సఖులారా... ఓ సఖి ...ఒహో చెలి ...ఒహో మదీయ మోహిని ఓ సఖి... ఒహో చెలి ...ఒహో మదీయ మోహిని... ఓసఖి కలలోపల కనిపించి వలపించిన చెలులోహొ...ఓ...ఓ.. కలలోపల కనిపించి వలపించిన చెలులోహొ.... కనుల విందు చేసారే కనుల విందు చేసారిక ధన్యుడనైతిని నేనహ.. ఓ సఖి... ఒహో చెలి ...ఒహో మదీయ మోహిని... ఓసఖి చరణం 1 : నయగారములొలికించి... ప్రియరాగము పలికించి నయగారములొలికించి... ప్రియరాగము పలికించి హాయినొసుగు ప్రియలేలే ......హాయినొసుగు ప్రియలేలే.... మరి మాయలు సిగ్గులు ఏలనే.... ఓ సఖి... ఒహో చెలి ...ఒహో మదీయ మోహిని... ఓసఖి చరణం 2 : కను చూపులు ఒక వైపు...మనసేమొ నా వైపు కను చూపులు ఒక వైపు...మనసేమొ నా వైపు ఆటలహొ తెలిసెను...ఏ...ఏ... ఆటలహొ తెలిసెను చెలగాటము నా కడ చెల్లునె... ఓ సఖి... ఒహో చెలి ...ఒహో మదీయ మోహిని... | |
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=53 |
Wednesday, January 30, 2013
ఓ సఖి ...ఒహో చెలి
Labels:
(జ),
ఘంటసాల,
జగదేకవీరుని కథ (1961),
పింగళి,
పెండ్యాల
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment