Monday, January 21, 2013

కొంచెం కారంగా

చిత్రం: చక్రం (2005)
సంగీతం: చక్రి
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: కౌసల్య

పల్లవి:

కొంచెం కారంగా..కొంచెం గారంగా
కొంచెం కష్ఠంగా..కొంచెం ఇష్ఠం గా
అందించనీ అధిరే అధరాంజలి..బంధించనీ కాలాన్నీ కౌగిలీ
సుడిగాలిగా మారి చుట్టేసుకోవాలి
మంచల్లే నిమిరే నీ జాలి..మంటల్లె నను మరిగించాలి

కొంచెం కారంగా..కొంచెం గారంగా
కొంచెం కష్ఠంగా..కొంచెం ఇష్ఠం గా

చరణం 1:

తలుపేసుకుంటే .. నీ తలపాగుతుందా
మదిలో నువ్వుంటే .. స్నానం సాగుతుందా
నీ విషమే పాకింది నర నరమునా...
ఇక నా వశము కాకుంది యమ యాతనా...
లేని పోని నిందలు గాని..హాయిగానే ఉందీ గాని
ఉన్నమాట నీతో చెప్పనీ !

కొంచెం కారంగా..కొంచెం గారంగా
కొంచెం కష్ఠంగా..కొంచెం ఇష్ఠం గా

చరణం 2:

అమ్మాయినంటూ .. నాకే గుర్తు చేస్తూ
లాగావు గుట్టూ .. గుండెల్లోకే చూస్తూ
నీ గాలి కబురొచ్చి నులివెచ్చగా
నువ్వేమేమి చేస్తావో చెబుతుండగా
మనసు కంది మన్మధలేఖ..కెవ్వుమంది కమ్మని కేక
వయసు కందిపోయే వేడిగా !

కొంచెం కారంగా..కొంచెం గారంగా
కొంచెం కష్ఠంగా..కొంచెం ఇష్ఠం గా
అందించనీ అధిరే అధరాంజలి..బంధించనీ కాలాన్నీ కౌగిలీ
సుడిగాలిగా మారి చుట్టేసుకోవాలి
మంచల్లే నిమిరే నీ జాలి..మంటల్లె నను మరిగించాలి

కొంచెం కారంగా..కొంచెం గారంగా
కొంచెం కష్ఠంగా..కొంచెం ఇష్ఠం గా

No comments:

Post a Comment