Monday, January 21, 2013

ఒకే ఒక మాట

చిత్రం: చక్రం (2005)
సంగీతం: చక్రి
గీతరచయిత: సిరివెన్నెల
నేపధ్య గానం: చక్రి

పల్లవి:

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదవూపలేనంత తీయంగా
నా పేరు నీ ప్రేమనీ
నా దారి నీ వలపనీ
నా చూపు నీ నవ్వనీ
నా ఊపిరే నువ్వనీ
నీకు చెప్పాలని

ఒకే ఒక మాట మదిలోన దాగుంది మౌనంగా
ఒకే ఒక మాట పెదవూపలేనంత తీయంగా

చరణం 1:

నేను అని లేను అని చెబితే ఏం చేస్తావు
నమ్మనని నవ్వుకొని చాల్లే పోమ్మంటావు
నీ మనసులోని ఆశగా నిలిచేది నేననీ
నీ తనువులోని స్పర్సగా తగిలేది నేననీ
నీ కంటిమైమరుపులో నను పొల్చుకుంటాననీ
తల ఆన్చి నీ గుండెపై నా పేరు వింటాననీ
నీకు చెప్పాలని

చరణం 2:

నీ అడుగై నడవడమే పయనమన్నది పాదం
నిను విడిచి బతకడమే మరణమన్నది ప్రాణం
నువ్వు రాకముందు జీవితం గురుతైన లేదనీ
నిను కలుసుకున్న ఆ క్షణం నను వొదిలిపోదనీ
ప్రతి ఘడియ ఓ జన్మగా నే గడుపుతున్నాననీ
ఈ మహిమ నేదేననీ నీకైనా తెలుసా అనీ
నీకు చెప్పాలని

No comments:

Post a Comment