చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) సంగీతం: ఎస్. రాజేశ్వరరావు గీతరచయిత: దాశరథి నేపధ్య గానం: సుశీల పల్లవి: ఓ...ఓ...ఆ ...ఆ....ఓ....ఆ.... వినిపించని రాగాలే కనిపించని అందాలే అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచే వినిపించని రాగాలే కనిపించని అందాలే ఏ ఏ... చరణం 1: తొలిచూపులు నాలోనే వెలిగించే దీపాలే తొలిచూపులు నాలోనే వెలిగించే దీపాలే చిగురించిన కోరికలే చిలికించెను తాపాలే వలచే మనసే మనసు వినిపించని రాగాలే కనిపించని అందాలే ఏ ఏ... చరణం 2: వలపే వసంతముల పులకించి పూచినది వలపే వసంతముల పులకించి పూచినది చెలరేగిన తెమ్మెరలే గిలిగింతలు రేపినవి విరిసే వయసే వయసు వినిపించని రాగాలే కనిపించని అందాలే... చరణం 3: వికసించెను నా వయసే మురిపించు ఈ సొగసే విరితేనెల వెన్నెలలో కొరతేదో కనిపించే ఎదలో ఎవరో మెరిసే వినిపించని రాగాలే కనిపించని అందాలే... అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచే వినిపించని రాగాలే కనిపించని అందాలే | |
Tuesday, January 22, 2013
వినిపించని రాగాలే
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment