Tuesday, January 29, 2013

చెట్టులెక్కగలవా ఓ నరహరి

చిత్రం: చెంచులక్ష్మి (1958)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: ఘంటసాల, జిక్కి

పల్లవి:

చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా?
చెట్టులెక్కగలవా ఓ నరహరి పుట్టలెక్కగలవా?
చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలవా?
ఓ నరహరి! చిగురు కోయగలవా?

చెట్టులెక్కగలనే! ఓ చెంచిత పుట్టలెక్కగలనే!
చెట్టులెక్కగలనే! ఓ చెంచిత పుట్టలెక్కగలనే!
చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలనే!
ఓ చెంచిత! చిగురు కోయగలనే!

చరణం 1:

ఉరకలేయగలవా? ఓ నరహరి! పరుగులెత్తగలవా?
ఉరకలేయగలవా? ఓ నరహరి! పరుగులెత్తగలవా?
ఊడ పట్టుకొని జారుడు బండకు ఊగి చేరగలవా?
ఓ నరహరి! ఊగి చేరగలవా?

ఉరకలేయగలనే! ఓ చెంచిత! పరుగులెత్తగలనే ఉరకలేయగలనే!
ఓ చెంచిత! పరుగులెత్తగలనే ఊడ పట్టుకొని జారుడు బండకు ఊగి చేరగలనే!
ఓ చెంచిత! ఊగి చేరగలనే!

చరణం 2:

ఓహో హోయ్... గురిని చూసుకుని
కనులు మూసుకుని బాణమేయగలవా?
ఓ నరహరి! బాణమేయగలవా?

గురిని చూసి వెనుతిరిగి
నాణెముగ బాణమేయగలనే!
ఓ చెంచిత బాణమేయగలనే!
ఓ చెంచిత నిన్ను మించగలనే..!

చెట్టులెక్కగలనే! ఓ చెంచిత పుట్టలెక్కగలనే!
చెట్టులెక్కగలనే! ఓ చెంచిత పుట్టలెక్కగలనే!
చెట్టులెక్కి ఆ చిటారు కొమ్మల చిగురు కోయగలనే!
ఓ చెంచిత! చిగురు కోయగలనే!

చరణం 3:

ఓహో హోయ్... తగవులేల ఎగతాళికాదు నను తాళిగట్టనీవా!
ఓ చెంచిత తాళిగట్టనీవా!
మనసు తెలుసుకొని మొరులు చూపితే మనువునాడనిస్తా!
ఓ నరహరి! మనువునాడనిస్తా!
ఓ నరహరి! మాలతెచ్చివేస్తా!

No comments:

Post a Comment