చిత్రం: చక్రవాకం (1974)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: రామకృష్ణ, సుశీల
పల్లవి:
వీణలేని తీగను నీవులేని బ్రతుకును
మోస్తూ జీవించలేను .. ముగిసిందని మరణించలేను
వీణలేని తీగను నీవులేని బ్రతుకును
మోస్తూ జీవించలేను .. ముగిసిందని మరణించలేను
జీవించలేను... మరణించలేను...
చరణం 1:
మనసు నిన్నే వలచింది నన్ను విడిచి వెళ్లింది
నిన్ను మరచి రమ్మంటే వీలుకాదు పొమ్మంది
మరువలేని మనసుకన్నా నరకమేముంది
ఆ నరకమందే బ్రతకమని ..నా నొసట నువ్వే రాసింది
చరణం 2:
వీణకేమి తీగ తెగితే మార్చుకుంటుంది
తెగిన తీగకు వీణ ఎక్కడ దొరకబోతుంది
తీగ మారినా కొత్త రాగం పలకనంటుంది
పాత స్మృతులే మాసిపోక బాధపడుతుంది
జీవించలేను... మరణించలేను...
చరణం 3:
బండబారిన గుండె నాది .. పగిలిపోదు చెదిరిపోదు
నువ్వు పేర్చిన ప్రేమ చితిలో .. కాలిపోదు బూదికాదు
నిన్ను కలిసే ఆశలేదు..
నిజం తెలిసే దారిలేదు..
చివరికి నీ జీవితానికి చిటికెడంత విషం లేదు
జీవించలేను... మరణించలేను..
No comments:
Post a Comment