Monday, January 21, 2013

వీణలోన తీగలోన ఎక్కడున్నది నాదము

చిత్రం: చక్రవాకం (1974)
సంగీతం: కె.వి. మహదేవన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

వీణలోన తీగలోన ఎక్కడున్నది నాదము
అది ఎలాగైనది రాగము
వీణలోనా తీగలోనా

చరణం 1:

మాటలోనా మనసులోనా
ఎక్కడున్నది భావము
అది ఎప్పుడౌను గానము
నాదమునకు స్వరమే రాగము
మనసులోని మాటే భావము
రాగ భావములేకమైనది
రమ్యమైనా గానము

వీణలోన తీగలోనా

చరణం 2:

గతజన్మ శ్రుతి చేసుకున్నది...
అది ఈ జన్మ సంగీతమైనది...
సరిగమ పదనిసానిదమప గరిగ
రాగాల ఆరోహణవరోహణైనది
అనురాగ హృదయాల అన్వేషణైనది

వీణలోనా తీగలోనా

చరణం 3:

గుండెలోనా గోంతులోనా ఎక్కడున్నది...ఆవేదన
అది ఎలాగౌను సాధన...
గీతమునకూ బలమే వేదన
రాగమునకూ మెరుగే సాధన
గుండె గొంతుకలేకమైనవి
నిండురాగాలాపన

వీణలోన తీగలోన ఎక్కడున్నది నాదము
అది ఎలాగైనది రాగము
వీణలోనా తీగలోనా

No comments:

Post a Comment