Monday, January 28, 2013

రాజాలా వెలుగూ

చిత్రం: చిరంజీవి (1985)
సంగీతం: చక్రవర్తి
గీతరచయిత: వేటూరి
నేపధ్య గానం: బాలు

పల్లవి:

రా రా రా హే..ఏ..ఏ..రూ..రూ..రూ హా..ఆ..ఆ
రాజాలా వెలుగూ..మారాజై బ్రతుకూ..
మత్తులాంటి యవ్వనాలు తెప్పరిల్లనీ..లేత లేత సోకులన్నీ రెప్పగిల్లనీ..
కొమ్మలోని కొయిలమ్మ పాటా..ఆ..కొత్త ఆశ పల్లవించు పూలబాటలో..ఓ..

పా..పా..పా..హా..ఆ..రూ రూ రూ హే హే హే..ఏ..
రాజాలా వెలుగూ..మారాజై బ్రతుకూ..

చరణం 1:

వెకువల్లే నిద్ర నుంచి నీవు మేలుకో..
వెన్నలంటి మల్లె పూలు వేడి చేసుకో..
వేడి వేడి ఊపిరంత వేణువుదుకో..
వేన వేల రాసలీల ఆడి పాడుకో..
చెలిమే నీకు ప్రాణం..మమతే నీకు ధ్యానం..
ఈ ప్రేమ సామ్రాజ్యమే ఏలుకో..ఏ దివ్యతీరాలకో సాగిపో..
నవ్వుతున్న యవ్వనాల నందనాలలో..ఓ..

రూ..రూ..రూ... హా..ఏ..ఏ..ఏ..హే..హే..హో..ఓ..
రాజాలా వెలుగూ..మారాజై బ్రతుకూ..

చరణం 2:

చుక్కలాంటి చక్కనమ్మ పక్కనుండిపో..
పైటలాగ జారిపోనీ పాట పాడుకో..
జాజిమల్లి జావలీల మత్తు జల్లుకో..
తీయనయిన జీవితాన్ని తీర్చిదిద్దుకో..

మనసే నీకు నేస్తం..మనిషే నీకు నేస్తం..
ఆ దైవమే నీవుగా మారిపో..ఆ స్వర్గమే నీదిగా చేసుకో..
మాసిపోనీ..మళ్ళీరానీ ఈ ఉగాదిలో..ఓ

లలలల..లాలా..లాలా లల..రర ర్ర ర్ర ర్రా..ఆ
రూ..రూ..హే..హే..
రాజాలా వెలుగూ..మారాజై బ్రతుకూ..
మత్తులాంటి యవ్వనాలు తెప్పరిల్లనీ..లేత లేత సోకులన్నీ రెప్పగిల్లనీ..
కొమ్మలోని కొయిలమ్మ పాటా..ఆ..కొత్త ఆశ పల్లవించు పూలబాటలో..ఓ..

తారా..రా..రా.రా హే..హే..ఏ..ఏ
రూ..రూ..రూ హా హా ఆ..

No comments:

Post a Comment