Monday, January 28, 2013

తెల్లమబ్బు తేరు మీద ఇలకు దిగిన

చిత్రం : చిన్నోడు పెద్దోడు (1987)

సంగీతం : బాలు

గీతరచయిత : వెన్నెలకంటి

నేపథ్య గానం : బాలు, జానకి




పల్లవి :




ఆ ఆ ఆ ఆ.... ఆ ఆ ఆ ఆ....


తెల్లమబ్బు తేరు మీద ఇలకు దిగిన వెండి చందమామా

ఓ భామా...  నువ్వే నా ప్రేమా



రెక్క విసిరి ఊహలన్ని రెపరెపలాడేటి గగన సీమా

కలిసేమా...  ఒకటై ఒదిగేమా




చరణం 1 :





యుగాలు వేచినా నిరీక్షలోనా

ఎడారి గుండెలో వరాల వానా

పదాలకందనీ ఎదంట నువ్వు

పదాల వాలినా సుమాన్ని నేను



వయసే తపించీ...  వలపే జపించీ

కలలే ఫలించీ...  కలిపే విరించి 

కుందనాల బొమ్మ...  కనువిందు చేసెనమ్మా

కోరివచ్చె కొమ్మ...  దరిజేరి ఏలుకొమ్మా

ఆరుౠతువులేకమైన ఆమని మనదే సుమా...




రెక్క విసిరి ఊహలన్ని రెపరెపలాడేటి గగన సీమా

కలిసేమా... ఒకటై ఒదిగేమా....




చరణం 2 :




గులాబి సిగ్గులా నివాళులీనా... వరించి నిన్ను నే తరించిపోనా


విరాళి సైపని  వియోగ వీణ...  సరాగమైనదీ స్వరాలలోన



చూపుల మందారం...  పాపట సిందూరం 


కులుకే సింగారం...  పలుకే బంగారం


చిరునవ్వుల సారం...  చిగురించిన సంసారం 


చెలి సొగసుల గారం...  చెలరేగిన శృంగారం


కలసిన హృదయాలలోన వెలసిన రసమందిరం 




తెల్లమబ్బు తేరు మీద ఇలకు దిగిన వెండి చందమామా 


ఓ భామా.... నువ్వే నా ప్రేమా....


రెక్క విసిరి ఊహలన్ని రెపరెపలాడేటి గగన సీమా

కలిసేమా... ఒకటై ఒదిగేమా....

ఆ......




http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=11509

4 comments:

  1. Ref: చరణం 1 - "పదాలకందనీ యతంట నువ్వు" = "పదాలకందనీ ఎదంట నువ్వు" అన్నట్టుగా వినిపించింది అండీ. సరిచూడగలరు.

    ReplyDelete
  2. ఇంకొక్క సవరణ అండీ.

    Ref: కలలే ఫలించీ...  కలిపే విరంచీ

    "విరంచి" అంటే "ఆట, క్రీడ" అని,
    "విరించి" అంటే "బ్రహ్మ" అని అర్ధం అనుకుంటాను.

    సందర్భానుసారం, "ఆ బ్రహ్మయే మనల్ని కలిపాడు" అన్న భావం పై వాక్యంలో సరిపోతుంది అనుకుంటాను.

    సరిచూడగలరు.

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ మహేష్ గారు... సరి చేశాను.

      Delete