చిత్రం: చింతామణి (1956)
సంగీతం: అద్దెపల్లి
గీతరచయిత: రావూరు వేంకటసత్యనారాయణరావు
నేపధ్య గానం: భానుమతి
పల్లవి:
రావోయి ... రావోయి
రావోయి రావోయి ఓ మాధవా ..రావోయి రావోయి ఓ మాధవా
అందాల రాధా అలిగింది బేగ
రావోయి రావోయి ఓ మాధవా .. అందాల రాణి అలిగింది బేగ
రావోయి రావోయి ఓ మాధవా
చరణం 1:
పొదరింటి నీడలలో పొంచింది రాధా
పొదరింటి నీడలలో పొంచింది రాధా
ఎదురుతెన్నులు చూచి విసిగింది రాధ
ఎదురుతెన్నులు చూచి విసిగింది రాధ ఇంక జాగేల మురళీ..
మోహన బేగి రావోయి రావోయి ఓ మాధవా ...
అందాల రాధా అలిగింది బేగ
రావోయి రావోయి ఓ మాధవా ..
చరణం 2:
ఊదుమురా యమునా విహారి .. నీ మురళీ
ఊదుమురా యమునా విహారి .. నీ మురళీ
ఆ .. ఆ .. ఆ .. ఆ ..
ఊదుమురా యమునా విహారి .. నీ మురళీ
ఊగునురా నీ రాధ ఆనంద డోళా
ఊగునురా నీ రాధ ఆనంద డోళా .. ఇంక జాగేల మురళీ ..
మోహన బేగి రావోయి రావోయి ఓ మాధవా
అందాల రాణి అలిగింది బేగ
రావోయి రావోయి ఓ మాధవా ..
చరణం 3:
తన ప్రేమ వేణువులో దాచింది రాధా
తన ప్రేమ వేణువులో దాచింది రాధా
అనురాగ రాగ సుధ అందించవేళా
అనురాగ రాగ సుధ అందించవేళా .. ఇంక జాగేల మురళీ ..
మోహన బేగి రావోయి రావోయి ఓ మాధవా
రావోయి రావోయి ఓ మాధవా .
అందాల రాధా అలిగింది బేగ
రావోయి రావోయి ఓ మాధవా ..
No comments:
Post a Comment