Monday, January 28, 2013

దోర నిమ్మపండులాగ ఊరించే దొరసాని

చిత్రం: చిక్కడు దొరకడు (1967) 
సంగీతం: టి.వి. రాజు 
గీతరచయిత: సినారె 
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల 

పల్లవి: 

దోర నిమ్మపండులాగ ఊరించే దొరసాని 
దోచుకోనా నీ పరువం ...దాచలేనే ఈ విరహం 

చరణం 1: 

పూలలోన సోయగాలు పొంగిపోయే నీలోన 
నింగిలోని చందమామ తొంగి చూసె నీలోన 

మెరుపులోని చురుకుదనాలు మెరిసిపోయె నీలోన 
మెరుపులోని చురుకుదనాలు మెరిసిపోయె నీలోన 
మరులొలికే నీ మగసిరి చూసి కరిగిపోదును లోలోనా 

దోర నిమ్మపండులాగ ఊరించే దొరసాని 
దోచుకోనా నీ పరువం... దాచలేనే ఈ విరహం 

చరణం 2: 

మేనిలోన వీణలేవో మెలమెల్లగ పలికినవి 
మనసులోన తేనెలేవో సనసనాగ ఒళికినవి 

నన్ను నీవు తాగగానే నడిరాతిరి నవ్వింది 
నన్ను నీవు తాగగానే నడిరాతిరి నవ్వింది 
వగలులూరే నీ నగవులు దాగే వలపు బాస తెలిసింది 

దోర నిమ్మపండులాగ ఊరించే దొరగారు 
దోచుకో ఇక నా పరువం... దాచుటెందుకు నీ విరహం

No comments:

Post a Comment