చిత్రం: చదువు సంస్కారం (1974)
సంగీతం: రమేశ్ నాయుడు
గీతరచయిత: రాజశ్రీ
నేపధ్య గానం: బాలు, సుశీల
పల్లవి :
వద్దూ.. వద్దు పెళ్ళొద్దు నీతో నా పెళ్ళొద్దు
వద్దు వద్దు వద్దు వద్దు.. పెళ్ళొద్దు
వద్దూ.. వద్దు అనొద్దు ఆ మాట నువ్వు అనొద్దు
వద్దు వద్దు వద్దు వద్దు.. అనొద్దు
చరణం 1 :
ఆ.. అంటే.. ఉహూ.. ఊ.. అంటే.. హో..
ఆ అంటే.. ఊ అంటే.. ఆరా తీస్తావూ
ఏదో ఏదో.. ఏదో సాకు చెప్పి సోదా చేస్తావూ
చట్టాలంటావు.. దొంగను పట్టాలంటావు
చట్టాలంటావు.. దొంగను పట్టాలంటావు
పడుకొన్నా ఆ.. గొడవే కలవరిస్తూ ఉంటావు
వద్దూ.. వద్దు పెళ్ళొద్దు నీతో నా పెళ్ళొద్దు
వద్దు వద్దు వద్దు వద్దు.. పెళ్ళొద్దు
చరణం 2 :
సూటిగా గుండెల్లోదూరి.. సోదా చేస్తానూ
వాడి వాడి చూపులతో.. నే బేడీలు వేస్తానూ
కౌగిలి చెరసాలలో నిన్ను.. నిన్నే.. ఖైదు చేస్తానూ
కనీ.. వినీ.. కని విని ఎరుగని కఠిన శిక్ష వేస్తాను వద్దా? వద్దు..
వద్దూ.. వద్దు అనొద్దు ఆ మాట నువ్వు అనొద్దు
వద్దు వద్దు వద్దు వద్దు.. అనొద్దు
చరణం 3 :
ఊఁహూఁహూఁ.. ఓ.. లలలల హాహాహా..
హోహో.. లల.. హో.. హా.. ఊఁహా.. హా..
ప్రేమంటే విలువైన జాతిరత్నం.. ఉఁహూఁ..
పెళ్ళంటే దాన్ని పొదిగే పసిడి ఉంగరం.. ఓహో..
ఉంగరాన వుంటేనే రతనానికి అందం..
ఇద్దరూ.. ఒకటైతే.. ఇద్దరూ ఒకటైతేనే..
హద్దులేని ఆనందం.. వద్దా?... ఆ...
వద్దూ.. వద్దు అనొద్దు ఆ మాట నువ్వు అనొద్దు
వద్దు వద్దు వద్దు వద్దు.. అనొద్దు
చరణం 4 :
ఇద్దరమన్నది మనలో ఎపుడో రద్దైపోయిందీ
అల్లరి మనసుల అల్లికలోనే.. పెళ్ళైపోయిందీ
అందుకే.. వద్దన్నానందుకే.. వద్దన్నగాని.. అసలొద్దాన్నానా..
ఈ నిముషంలో పెళ్ళన్నా.. నే కాదంటానా?
వద్దూ.. మనం అనొద్దు పెళ్ళొద్దనీ అనొద్దూ
వద్దు వద్దు వద్దు వద్దు.. అనొద్దూ..
http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=7216
No comments:
Post a Comment