Monday, January 21, 2013

ఆడవాళ్ళ కోపంలో అందమున్నది

చిత్రం: చదువుకున్న అమ్మాయిలు (1963) 
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 
గీతరచయిత: దాశరథి 
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల 

పల్లవి: 

ఆడవాళ్ళ కోపంలో అందమున్నది 
అహ అందులోనే అంతులేని అర్ధమున్నది.. అర్ధమున్నదీ 
మొదటి రోజు కోపం అదో రకం శాపం 
పోను పోను కలుగుతుంది భలే విరహ తాపం 
బ్రహ్మచారి లేత మనసు పైకి తేలదు 
తన మాటలందు చేతలందు పొత్తు కుదరదు పొత్తు కుదరదు 

చరణం 1: 

పడుచు వాడి మిడిసిపాటు పైన పటారం 
ఒక గడుసు పిల్ల కసర గానే లోన లొటారం 
పడుచువానీ .. ఒహో... 
పడుచు వాడి మిడిసిపాటు పైన పటారం 
ఒక గడుసు పిల్ల కసర గానే లోన లొటారం 

వగలాడి తీపి తిట్టు తొలి వలపు తేనె పట్టు 
ఆ తేనె కోరి చెంత చేర చెడామడా కుట్టు 

చరణం 2: 

పెళ్లికాని వయసులోని పెంకి పిల్లలు ఒహో 
తమ కళ్ళతోనే మంతనాలు చేయుచుందురు 
పెళ్లికాని వయసులోని పెంకి పిల్లలు ఒహో 
తమ కళ్ళతోనే మంతనాలు చేయుచుందురు 

వేడుకొన్న రోషం అది పైకి పగటి వేషం 
వెంటపడిన వీపు విమానం 

చరణం 3: 

చిలిపి కన్నె హృదయమెంతో చిత్రమైనది 
అది చిక్కు పెట్టు క్రాసు వర్డు పజిలు వంటిది 
చిలిపికన్నె.. ఉహూ... 
చిలిపి కన్నె హృదయమెంతో చిత్రమైనది 
అది చిక్కు పెట్టు క్రాసు వర్డు పజిలు వంటిది 

ఆ పజిలు పూర్తి చేయి తగు ఫలితముండునోయి ఆ 
మరపు రాని మధురమైన ప్రైజు దొరుకునోయి

No comments:

Post a Comment