చిత్రం: చంద్రలేఖ (1998) సంగీతం: సందీప్ చౌతా గీతరచయిత: సిరివెన్నెల నేపధ్య గానం: బాలు పల్లవి: సాహసమే చేయ్‌రా డింభకా..అన్నది కదరా పాతాళభైరవీ చొరవగా దూకకపోతే సాధించలేవురా నువ్వనుకున్నది ధైర్యముంటే...అహహహా....దక్కుతుందీ...అహహహా...రాకుమారీ తెలివిగా వెయ్‌రా పాచిక కల్లో మేనకా ఒళ్లో పడదా సులువుగా రాదుర కుంక బంగారు జింక వేటాడాలిగా నింగిదాకా...అహహహా.....నిచ్చెనేద్దాం...అహహహహా....ఎక్కిచూద్దాం అహహహా ఒహోహో.. చరణం 1: చందమామను అందుకుని ఇంద్రభవనాన్ని కడతానురా పడవంత కారులోన బజారులన్ని షికారు చేస్తానురా సొంతమైన విమానములో స్వర్గలోకాన్ని చుడతానురా అపుడు అప్సరసలు ఎదురు వచ్చి కన్ను కొడతారురా చిటికేస్తే అహహహా సుఖమంతా....అహహహా..మనదేరా చరణం 2: సున్ని ఉండలు కందిపొడీ ప్యాక్టరీలోన వండించనీ అమెరికా ఇరాను జపాన్ ఇరాకు జనాలు తింటారనీ కొన్ని ఎం.పిలను కొంటా కొత్త పి.ఎం ను నేనేనంటా స్కాములెన్నో చేసి స్విస్ బ్యాంకుకేసి డాలర్లలో తేలుతా సుడి ఉంటే..అహహహా...ఎవడైనా...అహహహా...సూపర్ స్టారే | |
Monday, January 21, 2013
సాహసమే చేయ్‌రా డింభకా
Labels:
చంద్రలేఖ (1998),
బాలు,
సందీప్ చౌతా,
సిరివెన్నెల
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment