Friday, February 1, 2013

శబ్బాసి శబ్బాసే

చిత్రం: జయం (2002) 
సంగీతం: ఆర్.పి. పట్నాయక్ 
నేపధ్య గానం: రవి వర్మ, బాలాజీ 

పల్లవి: 

శబ్బాసి శబ్బాసే శబ్బాసి శబ్బాసే 
బండి బండి రైలు బండి వేళకంటూ రాదులెండి 
దీన్ని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి 
బండి బండి రైలు బండి వేళకంటూ రాదులెండి 
దీన్ని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి 
ధడక ధడక ధడక దీని మయదారి నడక 
ఉలికి ఉలికి పడకే చిలకా 
జరుగు జరుగుమనక ఇది జరగలేదు జనకా 
క్రీస్తు పూర్వమింజను గనక 
శబ్బాసి శబ్బాసే శబ్బాసి శబ్బాసే 

చరణం 1: 

రంగులతో హంగులతో పైన పటారం 
అబ్బో సూపరని పోంగిపోకోయ్ లోన లోటారం 
అందరిలో నిండలలా ఎంత విడ్డూరం 
అయ్యో రైలంటే మిడిల్ క్లాసు నేల విమానం 
కూత చూడు జోరుగుందిరో దీని తస్సదీయ 
అడుగు ముందుకెయకుందిరో 
ఎంత సేపు దేకుతుందిరో దీని దిమ్మదియ 
చూడు చూడు నత్త నడకరో 
ఇది జీవితంలో ఎప్పటికీ టైముకసలు రాదు కదా 

శబ్బాసి శబ్బాసే శబ్బాసి శబ్బాసే 
బండి బండి రైలు బండి వేళకంటూ రాదులెండి 

చరణం 2: 

డొక్కుదని బొక్కిదని మూల పడేయ్‌రు 
ఇలా ముక్కుతున్నా మూల్గుతున్నా తిప్పుతుంటారు 
పాత సామాన్లోడికైనా అమ్ముకుంటేను 
తలో పిడికెడునో గుప్పెడునో శనగలొచ్చేను 
ఎంత పొడవు ఉంది చూడరో దీని బండబడ 
ఊరి చివర ఇంజనుందిరో 
ఎంత పొగలు కక్కుతుందిరో దీని దుంపతెగ 
బొగ్గు కొండ మింగినాదిరో 
నువు ఎక్కబోయే రైలెపుడూ లైఫు టైము లేటు కదా 

బండి బండి రైలు బండి వేళకంటూ రాదులెండి 
దీన్ని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి 
బండి బండి రైలు బండి వేళకంటూ రాదులెండి 
దీన్ని గాని నమ్ముకుంటే ఇంతేనండి ఇంతేనండి 
ధడక ధడక ధడక దీని మయదారి నడక 
ఉలికి ఉలికి పడకే చిలకా 
జరుగు జరుగుమనక ఇది జరగలేదు జనకా 
క్రీస్తు పూర్వమింజను గనక 
శబ్బాసి శబ్బాసే శబ్బాసి శబ్బాసే

No comments:

Post a Comment