Wednesday, June 26, 2013

చల్లలమ్మే భామనోయి

చిత్రం: జీవిత నౌక (1977) 
సంగీతం: కె.వి. మహదేవన్ 
గీతరచయిత: సినారె 
నేపధ్య గానం: సుశీల 

పల్లవి: 

చల్లలమ్మే భామనోయి.. పల్లె పట్టులేమనోయి 
అత్తచాటు పిల్లనోయి.. ఆకు మాటు పిందెనోయి 
దారి విడువు కృష్ణయ్యా..ఆ..ఆ.. దారికి అడ్డు రాకయ్యా 

చల్లలమ్మే భామనోయి.. పల్లె పట్టులేమనోయి 
అత్తచాటు పిల్లనోయి.. ఆకు మాటు పిందెనోయి 
దారి విడువు కృష్ణయ్యా..ఆ..ఆ.. దారికి అడ్డు రాకయ్యా 
నా దారికి అడ్డు రాకయ్యా.. 

చరణం 1: 

అడుగడుగున నీవెదురైతే.. నా అడుగు సాగదోయి..ఈ.. 
కొసరి కొసరి నువ్వు చూస్తుంటే.. నా కొంగు నిలువదోయి.. 
అడుగడుగున నీవెదురైతే.. నా అడుగు సాగదోయి..ఈ.. 
కొసరి కొసరి నువ్వు చూస్తుంటే.. నా కొంగు నిలువదోయి.. 

పాడు మగత కమ్మేనో..ఓ.. పట్టు తప్పి పోయేనో..ఓ.. 
పాడు మగత కమ్మేనో.. పట్టు తప్పి పోయేనో 
జాగైతే అత్త పోరు.. జామైతే మగని పోరు 

దారి విడువు కృష్ణయ్యా..ఆ..ఆ.. దారికి అడ్డు రాకయ్యా 
చల్లలమ్మే భామనోయి.. పల్లె పట్టులేమనోయి.. 

చరణం 2: 

చిలుకల కొలుకుల చీరలు దోచే.. చిలిపి వాడవంటా..ఆ.. 
పూటకు ఒక సయ్యాట చూపు.. నెర నీటు కాడవంటా 
చిలుకల కొలుకుల చీరలు దోచే.. చిలిపి వాడవంటా..ఆ.. 
పూటకు ఒక సయ్యాట చూపు.. నెర నీటు కాడవంటా 

రంగ రంగ శ్రీరంగా పాండురంగా.. నిజమే నీదొక అవతారం 
రంగ రంగ శ్రీరంగా పాండురంగా.. నిజమో ఘన కల్పానం..

No comments:

Post a Comment