Monday, June 17, 2013

దయ చూడవే గాడిదా

చిత్రం: జాతకరత్న మిడతంబొట్లు (1971)
సంగీతం: కోదండపాణి
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: బాలు

పల్లవి:

దయ చూడవే గాడిదా
పరువుకోసమని నిదురమానుకొని
వెదకి వెదకి వేసారినాను...ఆ..

దయ చూడవే గాడిద...తనిదనిదగమమగనిస ...
దయ చూడవే గాడిదా ... నిదమ ... దయ చూడవే గాడిదా

చరణం 1:

తోకకు ఆకులు కట్టె వెధవకు...
నువ్వు లేనిదే తోచకున్నదే
పాపం లచ్చి నిన్నటి నుంచి
పిచ్చి దానివలే తిరుగుతున్నదే..
దా ... దమదా ... మదమా ... దదదదదా .. ద దా ..దదా..దా
నీవు రాక మన ఊరి ఇండ్లలో
మురికి బట్టలు మురుగుచున్నవి

దొరికితివంటే పెడతా పచ్చని గడ్డి
దొరకకపోతే విరుగుతుంది నీ నడ్డి..
విరుగుతుంది నీ నడ్డీ....సరిదమగదగమగద ..

దయ చూడవే గాడిదా ... నిదమ ...
దయ చూడవే గాడిదా .. డిదా .. దా

చరణం 2:

హాహా.. ఎంతటి తియ్యని గానం
కోకిల కెక్కెడిదింతటి జ్ఞానం
హాహా.. ఎంతటి తియ్యని గానం
కోకిల కెక్కెడిదింతటి జ్ఞానం

సింహం కన్నా నీవే నయము
నిన్ను చూసినా కలుగదు భయము

వసుదేవుడు కొలిచిన గార్ధబ దేవా
బిర బిర దొరికిన కొడతా కొబ్బరికాయ.. కొడతా కొబ్బరికాయా...

తెల్లవారెను కోడికూసెను తొర్రి గుర్రం పళ్ళు తోమెను
ఏడిపించక దొరకవయ్యా గాడిదయ్యా......
ఏడిపించక దొరకవయ్యా గాడిదయ్యా...
గాడిదయ్యా.. గాడిదయ్యా.. హా...

లింగా... దోరికితివా దొంగా..
అదిరి బెదిరి పోతావెందుకు దూరంగా....

No comments:

Post a Comment