Monday, June 17, 2013

నీ చేయి నా చేయి

చిత్రం: జాతకరత్న మిడతంబొట్లు (1971)
సంగీతం: కోదండపాణి
గీతరచయిత: మైలవరపు గోపి
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:

నీ చేయి నా చేయి...పెనవేసి బాస చేయ్యి..
నాతోడు..ఈ బంధం కలకాలం ఉండనియ్యి..
సాక్షులు మన రెండు హృదయాలు...

నీ చేయి నా చేయి...పెనవేసి బాస చేయ్యి..
నాతోడు..ఈ బంధం కలకాలం ఉండనియ్యి..
సాక్షులు మన రెండు హృదయాలు....

చరణం 1:

మనసు మనసు మెలివేయ్యాలి..కోంగులు రెండు ముడివేయ్యాలి
మనసు మనసు మెలివేయ్యాలి..కోంగులు రెండు ముడివేయ్యాలి
బాసికాలు కడతావా...కోటి పూలు చుడతావా
పందిరిలో మనువులు కలిపి ...నా మురళికే నాదమౌతావా...

నీ చేయి నా చేయి...పెనవేసి బాస చేయ్యి..
నాతోడు..ఈ బంధం కలకాలం ఉండనియ్యి..
సాక్షులు మన రెండు హృదయాలు...

చరణం 2:

నీలో నాలో అనురాగాలు..వెలిగించాలి పదికాలాలు
నీలో నాలో అనురాగాలు..వెలిగించాలి పదికాలాలు
నవవధువును కావాలి...నీ ఎదపై వాలాలి
పల్లకిలో పండుగ చేసి...ఊరేగుతు పోంగిపోవాలి..

నీ చేయి నా చేయి...పెనవేసి బాస చేయ్యి..
నాతోడు..ఈ బంధం కలకాలం ఉండనియ్యి..
సాక్షులు మన రెండు హృదయాలు...

నీ చేయి నా చేయి...పెనవేసి బాస చేయ్యి..
నాతోడు..ఈ బంధం కలకాలం ఉండనియ్యి..
సాక్షులు మన రెండు హృదయాలు...

No comments:

Post a Comment