Friday, July 26, 2013

దేవుడు చేసిన

చిత్రం: దేవుడు చేసిన మనుషులు (1973) 
సంగీతం: రమేశ్ నాయుడు 
గీతరచయిత: శ్రీశ్రీ 
నేపధ్య గానం: ఘంటసాల, బాలు 

పల్లవి: 

దేవుడు చేసిన మనుషుల్లారా.. 
మనుషులు చేసిన దేవుళ్ళారా.. 

వినండి దేవుడి గోల.. కనండి మనుషుల లీల 
వినండి దేవుడి గోల.. కనండి మనుషుల లీల 

ఎంతో గొప్పవి మన ఆచారాలు.. స్వార్ధపరులకవి అవకాశాలు 

దేవుడు చేసిన మనుషుల్లారా.. 
మనుషులు చేసిన దేవుళ్ళారా.. 

వినండి దేవుడి గోల.. కనండి మనుషుల లీల 

చరణం 1: 

విఘ్నేశుడు వరదాయకుడన్నారూ 
ఈ పెద్దలందరు వినాయకుడు మా నాయకుడన్నారు 
పాపాలను ఉండ్రాళ్ళుగ చేసి.. మోసాలను జిల్లేళ్ళుగ పోసి.. 
పాపాలను ఉండ్రాళ్ళుగ చేసి.. మోసాలను జిల్లేళ్ళుగ పోసి.. 
ఇలవేలుపుగా ఊరేగించారు.. 
ఈ మహానుభావులు ప్రజల కళ్ళకే గంతలు కట్టారు 

వినండి దేవుడి గోల.. కనండి మనుషుల లీల 

ఎంతో గొప్పవి మన ఆచారాలు.. స్వార్ధపరులకవి అవకాశాలు 

దేవుడు చేసిన మనుషుల్లారా.. 
మనుషులు చేసిన దేవుళ్ళారా.. 

వినండి దేవుడి గోల.. కనండి మనుషుల లీల 

చరణం 2: 

నాటి గణపతికి పొట్ట పగిలితే రాలెను ఉండ్రాళ్ళు.. ఉండ్రాళ్ళు.. 
నేటి గణపతికి బొజ్జ పగిలితే రాలును రత్నాలు.. రత్నాలు.. 

పాపం బద్దలు కావాలి.. మోసం బయటకి రావాలి.. 
పాపం బద్దలు కావాలి.. మోసం బయటకి రావాలి.. 

పాపం బద్దలు చేయాలి.. మోసం బయటకి తియ్యాలి.. 
పాపం బద్దలు చేయాలి.. మోసం బయటకి తియ్యాలి..

No comments:

Post a Comment