Friday, July 26, 2013

దేవుడు చేసిన మనుషుల్లారా

చిత్రం: దేవుడు చేసిన మనుషులు (1973)
సంగీతం: రమేశ్ నాయుడు
గీతరచయిత: శ్రీశ్రీ
నేపధ్య గానం: ఘంటసాల

పల్లవి:

దేవుడు చేసిన మనుషుల్లారా..
మనుషులు చేసిన దేవుళ్ళారా..
వినండి మనుషుల గోల.. కనండి దేవుడి లీల
వినండి మనుషుల గోల.. కనండి దేవుడి లీల

దేవుడు చేసిన మనుషుల్లారా..
మనుషులు చేసిన దేవుళ్ళారా..
వినండి మనుషుల గోల.. కనండి దేవుడి లీల
వినండి మనుషుల గోల.. కనండి దేవుడి లీల

గోవిందా హరిగోవిందా.. గోవిందా భజగోవిందా
గోవింద గోవింద హరిగోవిందా.. గోవింద గోవింద భజగోవిందా
గోవింద గోవింద హరిగోవిందా.. గోవింద గోవింద భజగోవిందా

ఆ..ఆ..ఆ..ఆ.. ఓం..

చరణం 1:

వెన్నదొంగ.. ఆ వెన్నదొంగ.. మా.. తొలిగురువు
మా తొలిగురువు..
తొలినుంచీ మా కులగురువు..
మా కులగురువు..
కోరిన కోరిక తీరాలంటే.. కోరక మోక్షం రావాలంటే
గోపాలునే సేవించాలి.. గోవిందునే ధ్యానించాలి

గోవిందా హరిగోవిందా.. గోవిందా భజగోవిందా

వినండి దేవుడి గోల కనండి మనుషుల లీల
దేవుడు చేసిన మనుషుల్లారా
మనుషులు చేసిన దేవుళ్ళారా
వినండి దేవుడి గోల కనండి మనుషుల లీల...

చరణం 2:

పేదల నెత్తురు తాల్చిన రూపం
బలిసిన జలగలు దాచిన పాపం
పేదల నెత్తురు తాల్చిన రూపం
బలిసిన జలగలు దాచిన పాపం

మానవులను పీడించే జబ్బు.. దేవతలను ఆడించే డబ్బు
మానవులను పీడించే జబ్బు.. దేవతలను ఆడించే డబ్బు

తెలుపో నలుపో జాన్ దేవ్.. ఆ తేడాలిక్కడ లేనేలేవ్
తెలుపో నలుపో జానేదేవ్.. ఆ తేడాలిక్కడ లేనేలేవ్
లేనేలేవ్..
వినండి డబ్బుల గోల కనండి మనుషుల లీల
వినండి డబ్బుల గోల కనండి మనుషుల లీల

హే.. యహా..
గాలిబుడగ జీవితం ఓటి పడవ యవ్వనం
గాలిబుడగ జీవితం ఓటి పడవ యవ్వనం

నిన్న మరల రాదు రాదు రాదు.. నేడే నిజం.. నేడే నిజం
నేడే నిజం..
రేపు మనది కాదు కాదు.. నేడే సుఖం.. నేడే సుఖం
సుఖం.. సుఖం.. నేడే సుఖం
కాసే బ్రహ్మానందం..అహా.. ఓ డోసే పరమానందం.. ఒహో..
ఆ.. కాసే బ్రహ్మానందం..అహా.. ఓ డోసే పరమానందం.. ఒహో..
ఆ.. కాసే బ్రహ్మానందం.. హ్మ్.. డోసే పరమానందం
ఆనందం పరమానందం.. ఆనందం బ్రహ్మానందం 
ఆనందం పరమానందం.. ఆనందం బ్రహ్మానందం ఆనందం పరమానందం.. ఆనందం బ్రహ్మానందం ఆనందం పరమానందం.. ఆనందం బ్రహ్మానందం 
ఆనందం ఆనందం ఆనందం ఆనందం

వినండి గ్లాసుల గోల.. కనండి మనుషుల లీల
వినండి గ్లాసుల గోల.. కనండి మనుషుల లీల
దేవుడు చేసిన మనుషుల్లారా
మనుషులు చేసిన దేవుళ్ళారా
వినండి గ్లాసుల గోల.. కనండి మనుషుల లీల..

చరణం 3:

ఆలయాలలో వెలుతురు లేదు.. ఆకాశంలో చీకటి లేదు
ఆలయాలలో వెలుతురు లేదు.. ఆకాశంలో చీకటి లేదు

విమానాలలో విహరిస్తుంటే సముద్రాలనే దాటేస్తుంటే
విమానాలలో విహరిస్తుంటే సముద్రాలనే దాటేస్తుంటే

గుడిలో ఎందుకు రామయ్యా.. నిను విడుదల చేస్తాం రావయ్యా
గుడిలో ఎందుకు రామయ్యా.. నిను విడుదల చేస్తాం రావయ్యా
రామయ్యా.. రామయ్యా..
లేవయ్యా.. లేవయ్యా..

హ్యాండ్సప్..

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=238

No comments:

Post a Comment