Friday, July 26, 2013

కల ఇదనీ నిజమిదనీ

చిత్రం: దేవదాసు (1953)
సంగీతం: సి.ఆర్. సుబ్బరామన్
గీతరచయిత: సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం: ఘంటసాల

పల్లవి:

కల ఇదనీ నిజమిదనీ తెలియదులే.. బ్రతుకింతేనులే.. ఇంతేనులే
ఓ... కల ఇదనీ నిజమిదనీ తెలియదులే.. బ్రతుకింతేనులే.. ఇంతేనులే

పసితలపూ మనోరథం వెన్నెలనీడై పోయేనులే.. బ్రతుకింతేనులే
పసితలపూ మనోరథం వెన్నెలనీడై పోయేనులే.. బ్రతుకింతేనులే, ఓ....
కల ఇదనీ నిజమిదనీ తెలియదులే.. బ్రతుకింతేనులే ఇంతేనులే

చరణం 1:

ఎవియో మురిపాలెటకో పయనాలు దైవాల నీమాలింతే
ఎవియో మురిపాలెటకో పయనాలు దైవాల నీమాలింతే వరమింతే
చివురించిన పూదీవే విరియగా విరితావులు దూరాలై చనేనులే, ప్రేమ ఇంతేలే
పరిణామమింతేలే

కల ఇదనీ నిజమిదనీ తెలియదులే.. బ్రతుకింతేనులే.. ఇంతేనులే

చరణం 2:

నెరవేరని ఈ మమకారాలేమో ఈ దూరభారాలేమో
నెరవేరని ఈ మమకారాలేమో ఈ దూరభారాలేమో హితవేమో
ఎది నేరని ప్రాయానా చనువునా రవళించిన రాగమ్మే స్థిరమ్మౌ యోగమింతేలే
అనురాగమింతేలే

కల ఇదనీ నిజమిదనీ తెలియదులే.. బ్రతుకింతేనులే.. ఇంతేనులే


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1030

No comments:

Post a Comment