Friday, July 26, 2013

అంతా భ్రాంతియేనా

చిత్రం: దేవదాసు (1953)
సంగీతం: సి.ఆర్. సుబ్బరామన్
గీతరచయిత: సముద్రాల (సీనియర్)
నేపధ్య గానం: కె. రాణి

పల్లవి:

అంతా.. భ్రాంతియేనా.. జీవితానా.. వెలుగింతేనా
ఆశా.. నిరాశేనా.. మిగిలేది చింతేనా..ఆ ఆ...

అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా

చరణం 1:

చిలిపితనాల చెలిమే మరచితివో.. ఓ ఓ ...
చిలిపితనాల చెలిమే మరచితివో.. ఓ ఓ ...
తలిదండ్రుల మాటే దాటా వెరచితివో.. ఓ ఓ ...
తలిదండ్రుల మాటే దాటా వెరచితివో.. ఓ ఓ ...
పేదరికమ్ము ప్రేమపధమ్ము మూసివేసినదా.. నా ఆశే దోచినదా ...

అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా

చరణం 2:

మనసునలేని వారి సేవలతో.. ఓ ఓ ...
మనసునలేని వారి సేవలతో.. ఓ ఓ ...
మనసీయగలేని నీపై మమతలతో.. ఓ ఓ ...
మనసీయగలేని నీపై మమతలతో.. ఓ ఓ ...
వంతలపాలై చింతింతేనా వంతా దేవదా.. నా వంతా దేవదా.. ఆ ఆ ..

అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా
ఆశా నిరాశేనా మిగిలేది చింతేనా


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1031

No comments:

Post a Comment