Saturday, July 27, 2013

కరిగిపొమ్మంది ఒక చినుకు

చిత్రం: ధర్మచక్రం (1980) 

సంగీతం: సత్యం 

గీతరచయిత: మైలవరపు గోపి 

నేపథ్య గానం: బాలు, సుశీల 



పల్లవి : 


కరిగిపొమ్మంది ఒక చినుకు… కలిసి పొమ్మంది ఒక మెరుపు 

ఈ చలిలో..నీ ఒడిలో... తీయని కౌగిలిలో... 


కరిగిపొమ్మంది ఒక చినుకు…  కలిసి పొమ్మంది ఒక మెరుపు 

ఈ చలిలో..నీ ఒడిలో... తీయని కౌగిలిలో... 


కరిగిపొమ్మంది ఒక చినుకు … కలిసి పొమ్మంది ఒక మెరుపు 



చరణం 1: 


నడకే మయూరమాయే...నడుమే వయ్యారమాయే 

మెరుపుగా మారిపోనా...నీ కళ్ళలో కలిసిపోనా 


మైకం ఒకింత మైకం...బిడియం రవంత బిడియం 

చినుకుగా మారిపోనా...నీ గుండెపై చేరిపోనా 


కరిగిపొమ్మంది ఒక చినుకు … కలిసి పొమ్మంది ఒక మెరుపు 



చరణం 2 : 


తడిసే చకోరి సొగసు... పొంగే పదారు వయసు 

నా పెదవి కోరుతోంది... తొలి ముద్దు కోరుతోంది 



రానీ ముహూర్త సమయం ...కలలే ఫలించు తరుణం 

వలపే నివాళి చేసి ...నిలువెల్ల అల్లుకోనా 


కరిగిపొమ్మంది ఒక చినుకు... కలిసి పొమ్మంది ఒక మెరుపు..



http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2654

No comments:

Post a Comment