Friday, July 26, 2013

జగమే మారినది

చిత్రం: దేశద్రోహులు (1964)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: ఆరుద్ర
నేపధ్య గానం: ఘంటసాల

పల్లవి:

జగమే మారినది మధురముగా ఈ వేళా
జగమే మారినది మధురముగా ఈ వేళా
కలలూ కోరికలూ తీరినవీ మనసారా
జగమే మారినది మధురముగా ఈ వేళా

చరణం: 1

మనసాడెనే మయూరమై పావురములు పాడె.. యెల పావురములు పాడె
ఇదె చేరెను గోరువంక రామ చిలుక చెంత.. అవి అందాలా జంట
నెనరూ కూరిమీ ఈ నాడే పండెనూ.. నెనరూ కూరిమీ ఈ నాడే పండెనూ
జీవిత మంతా చిత్రమైన పులకింతా

జగమే మారినది మధురముగా ఈ వేళా
కలలూ కోరికలూ తీరినవీ మనసారా
జగమే మారినది మధురముగా ఈ వేళా

చరణం: 2

విరజాజుల సువాసనా స్వాగతములు పలుకా.. సుస్వాగతములు పలుక
ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ.. ఆ... ఆ.. ఆ.. ఆ.. ఆ ...
విరజాజుల సువాసనా స్వాగతములు పలుకా.. సుస్వాగతములు పలుక
తిరుగాడును తేనెటీగ తియ్యదనము కోరీ.. అనురాగాల తేలీ
కమ్మని భావమే కన్నీరై చిందెనూ.. కమ్మని భావమే కన్నీరై చిందెనూ
ప్రియమగు చెలిమీ సాటి లేని కలిమీ........

జగమే మారినది మధురముగా ఈ వేళా
కలలూ కోరికలూ తీరినవీ మనసారా
జగమే మారినది మధురముగా ఈ వేళా


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=115

No comments:

Post a Comment