Wednesday, July 31, 2013

కృష్ణా రావేలా

చిత్రం: నందిని (1987)
సంగీతం: ఇళయరాజా
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి:

కృష్ణా రావేలా....
కృష్ణా రావేలా ..మీరా వేచెనే
మరిచి మైమరిచి నిన్నే పిలిచెనే
పలికే...పలికించే అనురాగం నీవే ..

కృష్ణా రావేలా ..మీరా వేచెనే
కృష్ణా .. కృష్ణా .. కృష్ణా

చరణం 1:

నింగినేల నిలుచు వరకు ఈ కథా సాగనీ...
పూర్వజన్మ పుణ్యఫలం శుభస్వరం పాడనీ...
రాగవీణ చిందె నేడు కోటి కోటి బాసలే...
గుండెలోన గంతులేసే అంతులేని ఊహలే...
మనదేనులే బృందావనం..ఈ జీవితం నీకంకితం ..స్వర్గం ఇదియే...

మీరా రావేలా...నన్నే చేరగా
పలికే పలికించే అనురాగం నీదే...
మీరా రావేలా... నన్నే చేరగా

చరణం 2:

మల్లెల పందిరివేసి మెల్లగ చెంతకు చేరి ...మోహం తీరచవా
మల్లెల పందిరివేసి మెల్లగ చెంతకు చేరి ...మోహం తీరచవా
మనమధ బాణాలేసి వెన్నెల విందులు చేసి... దాహం తీర్చవా
మనమధ బాణాలేసి వెన్నెల విందులు చేసి... దాహం తీర్చవా

తొలకరి సొగసులు కొసిరి మనసులు గెలిచావే
పలికిన పలుకులలోనే మధువులు చిలికెనే
తలపు మేలుకొలుపు పాడెనే ..వలపు తేనె జల్లులు కురిసెనే..
ఒకరి కళలు ఒకరివాయెనే ...

కృష్ణా రావేలా ..మీరా వేచెనే
మీరా రావేలా .. నన్నే చేరగా
పలికే పలికించే అనురాగం నీదే
మీరా రావేలా .. నన్నే చేరగా
పలికే... పలికించే... అనురాగం నీదే
మీరా రావేలా .. నన్నే చేరగా..
కృష్ణా .. కృష్ణా .. కృష్ణా ...

చరణం 3:

తొలకరి సొగసులు కొసిరి మనసులు గెలిచావే
పలికిన పలుకులలోనే మధువులు చిలికెనే
తలపు మేలుకొలుపు పాడెనే ..వలపు తేనె జల్లులు కురిసెనే..
ఒకరి కలలు ఒకరివాయెనే !!

కృష్ణా రావేలా ..మీరా వేచెనే
మీరా రావేలా .. నన్నే చేరగా
పలికే పలికించే అనురాగం నీదే
మీరా రావేలా .. నన్నే చేరగా
పలికే పలికించే అనురాగం నీదే
కృష్ణా .. కృష్ణా .. కృష్ణా !

No comments:

Post a Comment