Wednesday, July 31, 2013

ఓ గోపెమ్మో ఇటు రావమ్మో

చిత్రం: ధర్మాత్ముడు (1983) 
సంగీతం: సత్యం 
గీతరచయిత: మైలవరపు గోపి 
నేపధ్య గానం: బాలు, సుశీల

పల్లవి: 

ఓ గోపెమ్మో.. ఇటు రావమ్మో 
ఈ దాసుని తప్పు దండంతో సరి మన్నించవమ్మో 

ఓ క్రిష్టయ్యో రాను పోవయ్యో 
నీ గడసరి మాటలు గారడి చేష్టలు చాలించవయ్యో... 

చరణం : 1 

సొగసే నీ అలకలు కూడా 
సొగసే ఓ ముద్దుల గుమ్మా 
ఈ ఒకసారికి చిరాకు పరాకు పడబోకే... 

తెలుసే ఇది రోజూ ఉండే వరసే 
చిరు చీకటి పడితే.. కౌగిట చేరగ తపించి తపించి పోతావే? 
న్యాయము కాదిది.. సమయము కాదిది.. 
న్యాయము కాదిది.. సమయము కాదిది.. 

గోపెమ్మో ఇటు రావమ్మో 
ఈ దాసుని తప్పు దండంతో సరి మన్నించవమ్మో 

ఓ కృష్టయ్యో రాను పోవయ్యో 
నీ గడసరి మాటలు గారడి చేష్టలు చాలించవయ్యో... 

చరణం : 2 

మదిలో తొలిరాతిరి తలపే మెదిలే నిను చూస్తూ ఉంటే 
ఎదలో కోరిక తళుక్కు తలుక్కు మంటుంటే... 
ఇపుడే ఈ సరసాలన్నీ ఇపుడే ఈ ముచ్చటలన్నీ 
మురిపము తీరగ హుళక్కి హుళక్కి అవుతాయే 
నమ్మవే నా చెలి.. నమ్మకమేమిటి? 
నమ్మవే నా చెలి.. నమ్మకమేమిటి? 

గోపెమ్మో.. ఊ.. ఇటు రావమ్మో 
ఈ దాసుని తప్పు దండంతో సరి మన్నించవమ్మో 
ఈ దాసుని తప్పు దండంతో సరి మన్నించవమ్మో 

ఓ కృష్టయ్యో రాను పోవయ్యో 
నీ గడసరి మాటలు గారడి చేష్టలు చాలించవయ్యో... 
నీ గడసరి మాటలు గారడి చేష్టలు చాలించవయ్యో... 

ఓ గోపెమ్మో.. రాను పోవయ్యో 
ఓ గోపెమ్మో.. రాను పోవయ్యో 
ఓ గోపెమ్మో.. రాను పోవయ్యో

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=4189

No comments:

Post a Comment