Tuesday, July 23, 2013

గాజులైతే తొడిగాడు నా రాజు

చిత్రం: డాక్టర్ బాబు (1973)
సంగీతం: టి. చలపతిరావు
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

గాజులైతే తొడిగాడు నా రాజు..
నా మోజులన్ని తీరేది ఏ రోజు...
హోయ్...చెయ్యి పట్టుకున్నాడు నా రాజు ...
ఇక...చెంగులు ముడి వేసేది ఏ రోజు...

చరణం 1:

ప్రతి కోకిన సన్నాయి పాట పాడుతున్నది..
ప్రతి చిలక ముత్తైదువులా చేరుకున్నది..
పెళ్ళిపడుచులా నా ఒళ్ళు ముడుచుకున్నది ...
పెళ్ళిపడుచులా నా ఒళ్ళు ముడుచుకున్నది
మూడు ముళ్లు తలచుకుంటే సిగ్గు ముసురుతున్నది ..ఈ..ఈ..ఈ..

గాజులైతే తొడిగాడు నా రాజు..
నా మోజులన్ని తీరేది ఏ రోజు...

చరణం 2:

నా చిలిపి వయసు నేలమీద నిలువకున్నది...
గాలి పల్లకిలో...గాలి పల్లకిలో.. మల్లికలా వూరేగుతున్నది..
రెండు కళ్ళలో ఒకే బొమ్మ నిండివున్నది...
రెండు కళ్ళలో ఒకే బొమ్మ నిండివున్నది..
ఆ బొమ్మను చూస్తుంటే ప్రాణం ఆగకున్నది

గాజులైతే తొడిగాడు నా రాజు..
నా మోజులన్ని తీరేది ఏ రోజు...
చెయ్యి పట్టుకున్నాడు నా రాజు ...
ఇక...చెంగులు ముడి వేసేది ఏ రోజు...


http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=2019

No comments:

Post a Comment