Tuesday, July 23, 2013

అల్ల నేరేడు చెట్టుకాడ

చిత్రం: డాక్టర్ బాబు (1973)
సంగీతం: టి. చలపతిరావు
నేపధ్య గానం: సుశీల

పల్లవి:

అల్ల నేరేడు చెట్టుకాడ అమ్మలాలా..
లేత సూరీడు పొడిచాడే అమ్మలాలా..
..సూరీడు పొడిచాడే అమ్మలాలా..

వాడి సూపుల్లో ఏముందో అమ్మలాలా...
వాడి సూపుల్లో ఏముందో అమ్మలాలా...
నాకు సురుకెత్తి..అమ్మో సురుకెత్తి..
నాకు సురుకెత్తి పోయిందే అమ్మలాలా
అల్ల నేరేడు చెట్టుకాడ అమ్మలాలా..
లేత సూరీడు పొడిచాడే అమ్మలాలా..
..సూరీడు పొడిచాడే అమ్మలాలా.

చరణం 1:

వాడు కనుగీటి చూశాడు..ఏదో కనికట్టు చేశాడు...
వాడు కనుగీటి చూశాడు..ఏదో కనికట్టు చేశాడు...
అయ్యో...అది ఏమి చోద్యమో అమ్మలాలా ..
నన్నూ ఆకట్టుకున్నాడే అమ్మలాలా ..

అల్ల నేరేడు చెట్టుకాడ అమ్మలాలా..
లేత సూరీడు పొడిచాడే అమ్మలాలా..
..సూరీడు పొడిచాడే అమ్మలాలా..

చరణం 2:

ఇంక మొగ్గవే నన్నాడు... లేత బుగ్గలే నిమిరాడు
ఇంక మొగ్గవే నన్నాడు... లేత బుగ్గలే నిమిరాడు
ఓపలేనా విసురు అమ్మలాలా ...
నా ఒళ్ళంతా సెగలాయె అమ్మలాలా..

అల్ల నేరేడు చెట్టుకాడ అమ్మలాలా..
లేత సూరీడు పొడిచాడే అమ్మలాలా..
..సూరీడు పొడిచాడే అమ్మలాలా..

చరణం 3:

మొన్న వల్లోన వేశాడు ..నిన్న కల్లోకి వచ్చాడు..
మొన్న వల్లోన వేశాడు ..నిన్న కల్లోకి వచ్చాడు..
అయ్యో..ఆపైన ఏమాయె అమ్మలాలా ..
పైట నా పైన లేదాయె అమ్మలాలా...

అల్ల నేరేడు చెట్టుకాడ అమ్మలాలా..
లేత సూరీడు పొడిచాడే అమ్మలాలా..
..సూరీడు పొడిచాడే అమ్మలాలా..

No comments:

Post a Comment