Thursday, August 1, 2013

కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే

చిత్రం: ఆత్మీయులు (1969)
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీతరచయిత: శ్రీశ్రీ
నేపధ్య గానం: ఘంటసాల, సుశీల

పల్లవి:

కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే
పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే ...
కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే
పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే...

చరణం 1:

నుదుట కళ్యాణ తిలకముతో పసుపు పారాణి పదములతో..
నుదుట కళ్యాణ తిలకముతో పసుపు పారాణి పదములతో..
పెదవిపై మెదిలే నగవులతో వధువునను ఓరగ చూస్తూంటే
జీవితాన పూలవాన ...

కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే
పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే ...

చరణం 2:

సన్నాయి చల్లగా మ్రోగి పన్నీటి జల్లులే రేగి
సన్నాయి చల్లగా మ్రోగి పన్నీటి జల్లులే రేగి
మనసైన వరుడు దరిచేరి మెడలోన తాళి
కడుతూంటే...
జీవితాన పూలవాన

కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే
పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే ...

చరణం 3:

వలపు హృదయాలు పులకించి
మధుర స్వప్నాలు ఫలియించి
వలపు హృదయాలు పులకించి
మధుర స్వప్నాలు ఫలియించి
లోకమే వెన్నెల వెలుగైతే..
భావియే నందన వనమైతే..
జీవితాన పూలవాన...

కళ్ళలో పెళ్ళి పందిరి కనపడసాగే
పల్లకిలోన ఊరేగే ముహూర్తం మదిలో కదలాడే ...

http://www.allbestsongs.com/telugu_songs/play-Telugu-Songs-iphone.php?plist=1662

No comments:

Post a Comment